చై - సామ్ : ఇండిపెండెంట్ విమెన్ ఇలానే ఉంటారు!

RATNA KISHORE
ఎంతో కాలంగా ఉన్న స్ప‌ర్థ‌లు కార‌ణంగా వీరు విడిపోయారా? అంటే స్ప‌ష్ట‌త లేదు. ఏళ్ల నాటి ప్రేమ అప్పుడే ముగిసిపోయిందా అంటే దీనిపై కూడా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేం. ప్రేమకు ముగింపు ప్రేమే త‌ప్ప మ‌రొక‌టి ఎలా అవుతుంది. ఆమె జీవితంలో నియంత‌లు ఉన్నారా? ఉంటే వారెవ్వ‌రూ? అయినా నీకెందుకు సినిమాలు వంటా వార్పూ చేసుకోక అన్న వారూ ఉన్నారా? అని కూడా అన్న‌వారు ఆ అక్కినేని కుటుంబంలో ఉన్నారా? ఉంటే ఎవ్వ‌రు? ఆమె పేరుకూ కీర్తికీ ఓర్వ‌లేని వారు కూడా ఉన్నారా? ఎందుక‌ని అత్త‌మ్మ (అమ‌ల‌) విల‌న్ అయి ఉన్నారు అన్న సందేహాలు కూడా విన‌వ‌స్తున్నాయి.



వీటిపై అక్కినేని కుటుంబం మాట్లాడ‌కుండా ఉంటే గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాల‌కూ అక్కినేని కుటుంబ‌మే కార‌ణం అయి ఉంటుంది అన్న నిర్థార‌ణ కూడా ఒక‌టి ముందుకు వ‌స్తుంది. గ‌తంలో ఆ కుటుంబంలో వివాదాలు వివాహాలు కొత్త‌వేం కాక‌పోయినా వాటిపై కూడా వాళ్లు నోరు విప్పిందీ లేదు. మాట్లాడిందీ లేదు. మేం విడిపోవాల‌ని అనుకున్నాం అందుకే విడిపోతున్నాం అని చెప్పి ఊరుకుంటే మిగ‌తా వారికి వాళ్లేం చెప్పాల‌నుకుంటున్నారు అన్న‌ది ఓ పెద్ద ప్ర‌శ్న.


ఇండిపెండెంట్ విమెన్ ఎలా ఉంటారు.. సమంత‌లా ఉంటారు. కెరియర్ ను నిర్మించుకునే క్ర‌మంలో ఉంటారు. వాటి కోసం కొన్ని వ‌ద్ద‌నుకుంటారు. కొన్ని కావాల‌ని ప‌రిత‌పిస్తారు. ప‌రిశ్ర‌మిస్తారు. ఇదే కోవ‌లో స‌మంత త‌న జీవితాన్నీ,  కెరియ‌ర్ నూ మార్చుకుని తీరాల‌న్న పంతంలో ఉన్నారు. అందుకే త‌న‌కు భ‌ర‌ణంగా వ‌స్తున్న రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లూ వ‌ద్ద‌నుకున్నారు. త‌న‌కు డబ్బు వద్ద‌ని అంటున్నారు. అదేవిధంగా తాను క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన అమ్మాయిన‌ని తన‌కు డ‌బ్బువద్ద‌ని అని అంటున్నార‌ని కూడా వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే స‌మంత త‌న కెరియ‌ర్ ను నిర్మించుకునే క్ర‌మంలో ఉన్నార‌ని కూడా తెలుస్తోంది. నాగార్జున కోడ‌లుగా త‌న‌కు వ‌చ్చిన గుర్తింపు క‌న్నా స‌మంత త‌న‌కు తాను సంపాదించుకున్న లేదా సాధించుకున్న పేరే చాలా గొప్ప‌ది. అదే స‌క్సెస్ ప్రొగ్ర‌స్ ను కంటిన్యూ చేయాల‌ని ఆమె ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా వివిధ భాష‌ల్లో న‌టిగా రాణించాల‌ని వెబ్ సిరీస్ లు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవి అన్నీ పేప‌ర్ వ‌ర్క్ ద‌శ‌లోనో, విజువ‌లైజ్డ్ వెర్షన్ లోనో ఉన్నాయి. వీటన్నింటితో త‌న‌ని తాను నిరూపించుకుంటూ, ఎద‌గాల‌ని ఆశిస్తున్నారు. కానీ అమ‌ల అడ్డుప‌డుతున్నార‌ని స‌మాచారం. అక్కినేని ఫ్యామిలీ అడ్డు ప‌డుతోంద‌ని స‌మాచారం. అందుకే ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చేశారు ఆ కుటుంబం నుంచి.......

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: