సినీ ఇండస్ట్రీ లో విషాదం.. జీ టీవీ నటి..మృతి..!
గత నెలలో బిగ్ బాస్ విన్నర్ బాలికా వధు సీరియల్ లో నటించిన సిద్ధార్థ శుక్ల మరణించి విషయం మరవకముందే.. ఇప్పుడు ఒక మరొక విషాదం చోటు చేసుకుంది. హిందీ సీరియల్స్ లో నటించే నటి మనీషా యాదవ్ హఠాన్మరణం కావడంవల్ల సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక ఈమె జీ టీవీలో ప్రసారమయ్యే"జోధా అక్బర్"అనే నాటికలు సలీమా బేగం అనే పాత్రను పోషించింది. ఈమె శుక్రవారం రోజున మరణించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీలోని కొందరు సంతాపం వ్యక్తం చేశారు.
ఇక ఆమెకు మరణానికి ముఖ్య కారణం.. కొంతమంది తెలిపిన ప్రకారం.. ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతుందని.. ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఆమె సహా నటి పరిధి శర్మ. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇలా చేయడం వల్ల ఆమె మరణించిన వార్త బయటకు వచ్చింది. ఇక నటి పరిధి శర్మ ఇలా మాట్లాడుతూ.."జోధా అక్బర్"సీరియల్ తర్వాత ఆమె తనతో అంతగా ఎవరితోనూ టచ్ లో లేదని ఆమె తెలియజేస్తోంది.
జోధా అక్బర్ లో నటించిన నటులందరూ కలిసి.."మొఘల్స్"అనే ఒక పేరుతో వాట్సాప్ లో గ్రూపు ని క్రియేట్ చేసుకున్నారని తెలియజేసింది. ఆ గ్రూపులో మనీషా చనిపోయిందని వార్త తెలియడంతో ఆ నటులంతా ఒక్కసారిగా షాక్ తిన్నట్లు తెలియజేసింది. మరణించిన మనీషాకు ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఇక ఆ బాబు గురించి ఆలోచించిన ఆ నటులంతా ఎంతో ఆందోళనకు గురవుతున్నట్లు గా తెలియజేసింది. ఇక ఆమె మరణించిన సమాచారాన్ని మొత్త తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తోంది నటి పరిధి శర్మ.