సంక్రాంతి బరికి ఈ హీరోలు సిద్ధం..!
బాలకృష్ణ 'అఖండ' సినిమా పోయిన సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ సెకండ్‌వేవ్‌తో షూటింగ్ లు ఆగిపోయి, 'అఖండ'కి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఈ వేసవిలో వాయిదా పడ్డ ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ ఫెస్టివల్ సీజన్‌ని ఇప్పటికే నాలుగు సినిమాలు లాక్ చేసుకున్నాయి.
'సర్కారు వారి పాట' షూటింగ్‌కి కరోనాతో అడ్డంకులు ఎదురైనా... మహేశ్ బాబు మాత్రం పొంగల్‌ని విడిచిపెట్టడం లేదు. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి సంక్రాంతికే దింపాలనుకుంటున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో బ్యాంక్‌స్కామ్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 13న విడుదలవుతోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తోన్న మల్టీస్టారర్ 'ఎఫ్3'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్2' సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతోంది. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రభాస్ చాలా కాలం తర్వాత రొమాంటిక్ జానర్‌లో చేస్తోన్న సినిమా 'రాధేశ్యామ్'. ఏడాది సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఫెస్టివల్ సీజన్‌లో ఎన్ని సినిమాలు రిలీజైనా ఓపెనింగ్స్‌కి ప్రాబ్లమ్ ఉండదు. హాలిడేస్‌తో ఎవరి కలెక్షన్లు వారికి వస్తుంటాయి. అందుకే స్టార్ హీరోలు పోటీ గురించి ఆలోచించకుండా బరిలో దిగుతున్నారు. ఇక చాన్నాళ్ల తర్వాత టాప్ హీరోలు వసూళ్ల వేటకి దిగుతుండడంతో ఇండస్ట్రీకి బోల్డంత ఎనర్జీ వస్తోంది. చూద్దాం.. ఎవరి సత్తా ఏంటో.