"రిపబ్లిక్" మూవీ సాయి తేజ్ పేరును నిలబెట్టింది...

VAMSI
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్టా డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్ ఈ చిత్రాన్ని జి స్టూడియోస్, జేబీ ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎంతో సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఇంతకు ముందు అంచనాలు వేరే..ఇపుడు వేరే ఎందుకంటే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం అవడం, కోమాలో ఉన్నాడని తెలియడం, అయితే ఇది జరిగి 20 రోజులు పైనే గడుస్తున్నా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబందించి క్లారిటీ రాకపోవడంతో అందరికీ మనసుల్లో ఫీలింగ్ పెరిగిపోయింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.

సమకాలీన రాజకీయాలను ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక నేడు రిలీజ్ అయిన ఈ చిత్రంపై ఆడియన్స్ తమ తమ అభిప్రాయాల్నిసోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఇక సినిమా ఎలా ఉంది...అనే విషయానికొస్తే చరిత్రలో నిలిచిపోయే ఓ అద్భుతమైన చిత్రం అంటున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల్ని కూడా ఆలోచించేలా చేయడమే కాదు బయటకు వచ్చాక కూడా ఆ ఆలోచనలు కొనసాగేలా ప్రభావం ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు. టేకింగ్ ఆ అద్భుతంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటన అసలు ఎవరూ ఊహించుకోలేని విధంగా ఓ రేంజ్ లో ఉంది. ఈ నటనతో సాయి తేజ్ ప్రేక్షకుల దృష్టిలో వేరే లెవెల్ లో ఉంటాడు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక మార్క్ ను ఏర్పరుచుకుని దూసుకుపోతున్నాడు.  

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ..మన బాధ్యత ఎంటో తెలియచేసేలా సినిమా ప్రేరేపిస్తుంది అని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ తన  పాత్రకు న్యాయం చేసింది. ఇక రమ్య కృష్ణ విషయానికొస్తే తన సీనియార్టీని చూపించారు. జగపతిబాబు యాక్టింగ్ సినిమాకి ప్లస్ గా నిలిచింది. ఓవరాల్ గా ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంకో వారం ఆగితే కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తుంది అన్నది తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: