"రిపబ్లిక్" మూవీ ప్రభావం "లవ్ స్టోరీ"పై పడనుందా ?

VAMSI
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ తెలుగు రాష్ట్రాలలో విడుదలై ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. దర్శకుడు దేవకట్టా ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రాజకీయాలపై తెరకెక్కినప్పటికి ఈ చిత్రం వాటికి విభిన్నం అంటున్నారు చూసిన వారు. ఈ సినిమా చూసినంత సేపు ప్రతి సన్నివేశంలోనూ మనము ఉన్నామనే భావన, మనకు స్పందించాల్సిన బాధ్యత ఉంది అనేంతగా ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తోంది. ఇదంతా దర్శకుడు దేవకట్టా డైరెక్ట్ చేసిన మ్యాజిక్ అనే చెప్పొచ్చు. దానికితోడు సాయి ధరమ్ తేజ్ అత్యుత్తమమైన నటన అలా రెప్పార్పకుండా చూసేలా ఉంది.

జగపతి బాబు, రమ్యకృష్ణ లు అద్భుతంగా నటించారు అనడం కంటే  ప్రాణం పెట్టి జీవించారు అని చెప్పవచ్చు. అలా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ముందుకు సాగుతోంది. అయితే ఈ చిత్రం లవ్ స్టోరీ చిత్రాలకి గట్టిపోటీ ఇవ్వడం మాత్రమే కాదు దానిని మించి రికార్డ్ సృష్టించేలా  ఉంది అంటున్నారు కొందరు ప్రేక్షకులు. లవ్ స్టొరీ చిత్రం ప్రధానంగా యువతను ఆకర్షిస్తుంది. కానీ రిపబ్లిక్ చిత్రం ప్రతి భారతీయుడిని ప్రేరేపించేలా ఉంది ప్రతి పౌరుడు ఖచ్చితంగా చూడాల్సిన ఒక మంచి కథనం అంటున్నారు. అందులోనూ ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలతో ఒక సినిమాని తెరకెక్కించడం అనేది పెద్దగా కనిపించలేదు. కానీ దర్శకుడు దేవకట్టా నిజంగా పెద్ద ప్రయోగమే చేశాడు.

అదే కాకుండా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడం ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు బయటకు తెలియకపోవడంతో  ప్రేక్షకుల్లో పెరుగుతోంది. అది కూడా ప్రేక్షకుడిని ఈ సినిమా చూసేందుకు ప్రేరేపించడం ఒక కారణమే అంటున్నారు. అందులోనూ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథ సమకూర్చిన విధానం హైలెట్ గా నిలుస్తోంది...ఇలా అన్ని కలిసొచ్చి ఈ చిత్రానికి హైప్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. అయితే రిపబ్లిక్  సినిమా ప్రభావం ఖచ్చితంగా లవ్ స్టొరీ చిత్రంపై పడనుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు అయితే ఇంకో నాలుగైదు రోజులు గడిస్తే కానీ ఓ క్లారిటీకి రావడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: