అల్లు రామలింగయ్య.. 1922
అక్టోబర్ 1వ తేదీన ఒక హాస్యరత్నం జన్మించింది.. గత మూడు తరాలుగా సినీ ప్రేక్షకులను తన హాస్యంతో అలరించి, మెప్పించిన
మహా గొప్ప హాస్యనటుడు.. మొట్టమొదటిసారిగా ప్రముఖ హాస్యనటుడు రేలంగి తరువాత
పద్మశ్రీ అవార్డు అందుకున్న రెండవ హాస్యనటుడిగా చరిత్రపుటల్లో కెక్కాడు. ఈయన కుమారుడు ప్రముఖ
నిర్మాత అల్లు అరవింద్ కాగా ఈయన అల్లుడు
మెగాస్టార్ చిరంజీవి అన్న విషయం అందరికీ తెలిసిందే..
చిన్న వయసులోనే నాటకాలు వేసిన
అల్లు రామలింగయ్య 1952 లో పుట్టిల్లు అనే చిత్రంలో కూడు గుడ్డ శాస్త్రి పాత్ర ద్వారా చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు..
ఇక అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారుగా 1116 చిత్రాలలో నటించినా .. ఆయనకున్న నటించాలనే కోరిక చావ లేదట.. హాస్య నటుడిగా, విలన్ గా, పాటల రచయితగా కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదు నిర్మాతగా కూడా గీతాఆర్ట్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి ,ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడం జరిగింది..
ఈయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం గౌరవంగా
పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.. 1990 వ సంవత్సరంలో
పద్మశ్రీ అవార్డు అందుకున్న రెండవ హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 2001వ సంవత్సరంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం అయిన రఘుపతి
వెంకయ్య అవార్డు కూడా ఆయనకు లభించింది.. అంతే కాదు ఆయన హాస్యాన్ని నాటికి నేటికీ మర్చిపోలేక ఆయన అభిమానులు.. పాలకొల్లులో విగ్రహం కూడా నెలకొల్పారు.. ఆయన జీవితం లో సంతృప్తినిచ్చిన సన్నివేశాలు ఏవైనా ఉన్నాయా అంటే.. అది కేవలం ఆయన కొడుకు నిర్మాతగా మారడం, అల్లుడు
మెగాస్టార్ గా ఎదగడం, మనవుడు
అల్లు అర్జున్ హీరోగా తన స్థానాన్ని నిలదొక్కుకోవడం ఇలా ఇవన్నీ ఆయన జీవితంలో ఎప్పటికీ మరువలేనివి..
2013వ సంవత్సరంలో భారత చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, రూపొందించిన 50 తపాలా బిళ్ళలలో
అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం గా కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేయడం గమనార్హం..
ఎన్టీఆర్ లాంటి గొప్ప నేతలకు జ్ఞాపకార్థంగా తపాలా బిళ్ళను విడుదల చేయగా, ఆ తర్వాత అత్యంత గొప్ప పురస్కారం గా ఈయన పేరు మీద కూడా తపాల బిళ్ళను రూపొందించారు.