సహాయక పాత్ర నుండి నిర్మాతగా ఎదిగిన యంగ్ హీరో..!

Divya
శర్వానంద్ మైనేని.. అందంతో యువతని బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటున్నాడు శర్వానంద్. 1984 మార్చి 6 తేదీన విజయవాడలో జన్మించారు.. ఇక ఈయన తండ్రి వ్యాపారస్తుడు కావడంతో హైదరాబాద్ లో సెటిల్ కావాల్సి వచ్చింది. ఇక అక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి తన ప్రాథమిక విద్యను పూర్తిచేసి, సికింద్రాబాద్ లో ఉన్న వెస్లీ డిగ్రీ కాలేజ్ లో బీకాం పూర్తి చేశాడు.. ఇక కళాశాల లో ఉన్నప్పుడు శర్వా నంద్ ను ది హిందుస్ బెస్ట్ న్యూ ఫేస్ గా కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇక సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలన్నా ఆలోచనతోనే మొదట డాన్స్ లో ప్రావీణ్యం పొంది, ఆ తరువాత 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ముంబైలోని కిషోర్ నమిత కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకున్నాడు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దగ్గుపాటి రానా, రామ్ చరణ్ , శర్వానంద్ ముగ్గురు క్లాస్ మేట్స్.. ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్  కారణంగానే శర్వానంద్ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఇక రామ్ చరణ్ ప్రోత్సాహంతోనే తన తండ్రి చిరంజీవి నటించిన థమ్స్ అప్ యాడ్ లో మీడియా దృష్టిలో పడ్డాడు. 2003 లో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమాలో సహాయక పాత్రలలో నటించాడు. ఆ తర్వాత వెంకటేష్ సంక్రాంతి , లక్ష్మి సినిమాలో వెంకటేష్ కి తమ్ముడి పాత్రలో నటించి మెప్పించాడు.. శర్వానంద్ కు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా గమ్యం అని చెప్పాలి..
అందరి బంధువయ , ప్రస్థానం వంటి సినిమాలు ద్వారా  విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక శర్వానంద్ హీరోగా మాత్రమే కాదు.. 2012లో  కో కోటి కోటి అనే సినిమాతో నిర్మాతగా కూడా అరంగేట్రం చేశాడు. సర్వ ఆర్ట్స్ అనే సంస్థ నిర్మించడం జరిగింది. వాణిజ్యపరంగా మంచి హిట్ ఇచ్చిన సినిమా రన్ రాజా రన్. ఆ తర్వాత నిత్యామీనన్ తో కలిసి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శతమానం భవతి సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలను వసూలు చేసి అతిపెద్ద వాణిజ్య సినిమాగా నిలిచింది..
ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోగా , ప్రస్తుతం మహా సముద్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి సిద్ధమయ్యాడు శర్వానంద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: