పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించి డిజాస్టర్ గా మిగిలిన ప్రభాస్ సినిమా..!

Divya
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ఆయన స్థాయి విపరీతంగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రభాస్ చేత పాన్ ఇండియా మూవీ గా బాహుబలి సినిమాను తెరకెక్కించాడో.. ఆ రోజు నుంచి ప్రభాస్ స్టార్ మరింత పెరిగిపోయింది.. అంతేకాదు ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక భారతదేశం సినీ పరిశ్రమలో 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తెలుగు నటుడిగా కూడా గుర్తింపు పొందాడు.

ఇంతటి రేంజ్ ని సంపాదించుకున్న ప్రభాస్, ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమా కథలనే ఓకే చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తెరకెక్కించిన సినిమా సాహో.. ఇక ఈ చిత్రాన్ని 2019 సంవత్సరంలో ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి , వంశీ కృష్ణా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.. ఈ సినిమాను తమిళ ,హిందీ , తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయగా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

ఈ సినిమాను రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు.. బాక్సాఫీస్ వద్ద రూ.433 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన అప్పటికీ కథ పరంగా భారీ డిజాస్టర్ చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వచ్చి , మంచి టెక్నాలజీతో పాటు సరికొత్త సినిమా గ్రఫీ ను కూడా పరిచయం చేశారు. కానీ ఈ సాహో సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పాలి.. అంతేకాదు బాహుబలి సినిమా తర్వాత ప్రేక్షకులు.. సాహో సినిమా కూడా అంతే బాగుంటుందని ఊహించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక, కథ పరంగా డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: