సెలెబ్రేషన్స్ మూడ్ లో సమంత.. కారణం అదేనా..?
'సాకి' పేరుతో క్లాతింగ్ బ్రాండ్ ను మొదలుపెట్టిందని తెలుస్తుంది సమంత. ఈ భామ తన వెంచర్ మొదలుపెట్టి ఏడాది పూర్తయిందని సమాచారం. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని అందరితో పంచుకున్నట్లు తెలుస్తుంది. తెలుపు రంగు కేక్ చేతిలో పట్టుకొని ఆనందంలో ఎగిరి గంతేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకుందట.
మొత్తానికి మేము సంవత్సరం పూర్తి చేశాం అని తెలిపినట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని నా బృందం మరియు నా అందమైన కుటుంబమైన మీతో వేడుకగా చేసుకోవాలనుకుంటున్నా అని సమంత చెప్పినట్లు సమాచారం. మీ అందరితో వేడుక జరిపేందుకు వారమంతా ఎక్జయిటింగ్ ఈవెంట్స్ తో ప్రణాళిక సిద్దమవుతుంది .అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించినట్లు తెలుస్తుంది.. తమ మనసును మరియు ఆత్మను ఇక్కడ పెట్టి పెద్ద విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన 'సాకి' ప్రతిభావంతులైన బృందానికి కేరింతలతో అభినందనలు తెలియజేస్తున్నా అని తెలిపినట్లు సమాచారం. మేమంతా మరో ఆహ్లాదకరమైన మరియు ఉత్తేజకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం అని సమంత తెలిపిందట. గత సంవత్సరం కాలంగా మీరు మా పట్ల చూపిస్తున్న ఆదరణ మరియు ప్రేమ కొనసాగిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నట్లు సమాచారం.
సమంత మొదలుపెట్టిన 'సాకి' సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పరిశ్రమ స్నేహితులు సామ్ కు శుభాంకాంక్షలు తెలియజేశారని సమాచారం. సమంత పోస్టును షేర్ చేస్తూ టాలీవుడ్ హీరోయిన్లు అయిన ప్రగ్యాజైశ్వాల్ మరియు తమన్నా ,సంయుక్తా హెగ్డే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారని సమాచారం.సమంత తన ఫ్యాన్స్ కు త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోందనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి అది ఎంత వరకు నిజమో వేచి చూడాలి.