పుష్ప పాట ఎన్ని వ్యూస్ సాధించిందో తెలుసా..?

murali krishna
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప' కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మన అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందిన సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా కథ పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగున్నట్లు చిత్ర టీజర్లో తెలియజేసిందట చిత్ర బృందం.కాగా ఈ సినిమా నుండి 'దాక్కొ దాక్కొ మేక' అనే ఫస్ట్ సింగిల్ పాటను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే .

రాక్‌స్టార్ గా పేరు పొందిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాటకు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ పాట ట్రెండింగ్‌లో దూసుకుపోయిందని సమాచారం. ఇక తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుందని సమాచారం. అన్ని భాషల్లో కలిపి ఈ పాటకు ఇప్పటివరకు సుమారు 80 మిలియన్ వ్యూస్ సాధించిందని తెలుస్తుంది. దీంతో బన్నీకి తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో ఇట్టే అర్థం అవుతుంది. ఇక పుష్ప చిత్రం కోసం మిగతా భాషల ఆడియెన్స్ కూడా ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. కాగా ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడని సమాచారం.

రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు రెడీ అయ్యిందని సమాచారం. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందని తెలుస్తుంది.. మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: