అస్సలు తగ్గేదే లేదంటున్న ప్రకాశ్ రాజ్ ?

Veldandi Saikiran
విలక్షణ నటుడు ప్రకాష్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్ర పరిశ్రమలు నటుడిగా దర్శకుడు మరియు నిర్మాత గా ఉన్నత స్థాయికి ఎదిగారు ప్రకాష్ రాజు. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఏకంగా ఆరు భాషల్లో తన ప్రతిభ చాటుకున్నాడు ప్రకాష్ రాజ్. నటనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు ప్రకాశ్ రాజ్. ఇప్పటివరకు నాలుగు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకని చరిత్ర సృష్టించారు ప్రకాష్ రాజ్. నటుడిగా ప్రకాష్ రాజు కు గుర్తింపు తెచ్చిన చిత్రం డ్యూయెట్. కె.బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమా రాగా... ఈ సినిమాతో ప్రకాష్రాజ్ క్రేజ్ రేంజ్ కు వెళ్ళింది. కర్ణాటక రాష్ట్రంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ప్రకాష్ రాజ్. మధ్యతరగతి జీవితం గడుపుతూ ఎట్టకేలకు ఓ గొప్ప నటుడిగా వెలుగొందారు ఈ విలక్షణ నటుడు.

 

ఇక ప్రకాష్ రాజు కెరీర్ విషయానికి వస్తే.... హీరోగా, విలన్ గా ఇలా ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ చేసిన ప్రతి పాత్ర చాలా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో...  సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.  ప్రకాష్ రాజ్  విలన్ పాత్ర లు చేయడం కారణంగానే ఎక్కువ గుర్తింపు మరియు అవార్డులు వచ్చాయి. 2003 సంవత్సరంలో వచ్చిన గంగోత్రి సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు.  ఈ సినిమాలో ఉత్తమ ప్రతినాయకుడిగా ప్రకాష్రాజ్ నంది అవార్డు అందుకున్నారు. అలాగే మరి కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. దూకుడు మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలలో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్ తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నారు. ఈ రెండు సినిమాలకు కూడా నంది అవార్డులు దక్కించుకున్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇటు తెలుగు అటు తమిళంలో రెండు చిత్ర పరిశ్రమలోనూ ఓ మంచి నటుడిగా స్థానం దక్కించుకున్నారు ప్రకాష్ రాజు.

రాజకీయ ప్రస్థానం : ప్రకాష్ రాజు సినిమాల తర్వాత ఎక్కువగా పాలిటిక్స్ పైనే ఫోకస్ చేస్తారు.  ముఖ్యంగా ఆయన భారతీయ జనతా పార్టీ విధానాలను ఆ పార్టీ నాయకులను వ్యతిరేకిస్తూ ఉంటారు. అంతే కాదు బిజెపి పార్టీ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ఉంటారు ప్రకాష్ రాజు. ఇక కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్ సభ  నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు ప్రకాష్ రాజ్. అయితే ఈ పోటీలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు ప్రకాష్ రాజ్.  ఇక ప్రస్తుతం మా అధ్యక్ష ఎన్నిక  బరిలో ఉన్నారు ప్రకాష్ రాజ్. ఇలా ప్రకాష్ రాజ్ అన్నిరంగాల్లోనూ దూసుకు వెళుతూ... అందరి మన్ననలు పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: