బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే..

Purushottham Vinay
మునుపటి సీజన్ల కంటే కూడా ఎన్నడూ లేనంతగా ఈ బిగ్ బాస్ సీజన్ 5 గురించి చర్చ అనేది సాగుతోంది.స్టార్టింగ్ నుంచే గొడవలతో జనాలకు కిక్కేస్తుంది.ఇక ఇప్పటిదాకా తెలుగులో 4 బిగ్ బాస్ టీవీ షో లు స్టార్ట్ అయ్యి మంచి ప్రేక్షకాధరణ పొందాయి. ఇక బిగ్ బాస్ 5 ఇటీవలే ఆరంభమై విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకోవడం జరిగింది.ఇక మొదటి వారంలో సరయు ఇంకా రెండో వారంలో ఉమా దేవి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక మూడో వారంలో అంటే ఈ వారం నామినేషన్లలో ఐదుగురు పోటీదారులు ఉన్నారు. ఇక రెండవ వారం నామినేషన్లలో ఉన్న ప్రియా- ప్రియాంక సింగ్ ఇప్పుడు నామినేషన్ లో వున్నారు. వారు ఇక మరో వారం దాకా కూడా ప్రమాద ఘంటికలను ఎదుర్కొనడం జరుగుతోంది. ఇక వారితో పాటు మానస్ నాగులపల్లి ఇంకా శ్రీరామ చంద్ర అలాగే లహరి కూడా వున్నారు. ఇక ప్రియ- ప్రియాంక సింగ్ మరోసారి హాట్ గొడవలతో మూడో వారానికి కూడా నామినేషన్లలో ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

ఇక శ్రీరామ చంద్ర-మానస్ ల మధ్య విబేధాలు అనేవి ఈ నామినేషన్లలో ఉండటానికి ప్రధాన కారణం కావచ్చు. ఇక అలాగే ఇంట్లో ప్రధాన పని సమయంలో ఇద్దరూ తోడేలు జట్టు ఇంకా డేగ జట్టుకు కెప్టెన్లు. ఆట సమయంలో తేడాలు అనేవి వారి నామినేషన్లలో వారి స్థానానికి దారి తీశాయి.ఇక ఆ ఐదుగురిలో ప్రియ బాగా బలహీనంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల చరిత్రను చూసినట్లయితే వయస్సులో పెద్ద వారుగా ఉన్న కంటెస్టెంట్ లు ఇంట్లో నుంచి చాలా ముందుగానే వెళ్లిపోవడం జరిగింది. ఇక అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ రెండవ వారంలో ఉమా దేవి ఇంటి నుండి బయటకు రావడం జరిగింది.ఇక ప్రియకు కూడా అదే జరగవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే షో నిర్వాహకులు చెప్పినట్లుగా  చూసుకున్నట్లయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అంతవరకూ ఆగి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: