ఘంటసాల లేకుంటే నాగేశ్వరరావు సినిమాల్లోకి వచ్చేవారే కాదా?

VAMSI
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రారంభమైన తొలినాళ్ళలో ఉన్న అగ్ర కథానాయకులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. సినీ పరిశ్రమ ఎదుగుదలకు కారణమైన ప్రముఖులలో ఈయన ఒకరు అని చెప్పవచ్చు. ఆనాడు చెన్నైలో ఉన్నటువంటి సినీ పరిశ్రమను ఆంధ్రలోని హైదరాబాద్ కు తరలించిన దిగ్గజాలలో నాగేశ్వర రావు కూడా ప్రముఖ పాత్ర వహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి మూలమైన ప్రముఖులు నాలుగు స్తంబాలు అయితే వాటిలో అక్కినేని నాగేశ్వరావు గారు ఒకరు. ఘంటసాల సినిమా అవకాశం ఇవ్వకుంటే మనము గొప్ప నాయకుడిని చూసేవారిమీ కాదేమో అని ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటే పోతే ఎంతో..ఆయన కీర్తిని చెప్పడానికి మాటలు సరిపోవు, స్టేజిపై నాటకాలతో మొదలైన ఆయన జీవితం ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఎదిగింది అంటే ఆయన గొప్పతనం, ప్రతిభ, పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తొలుత నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించేవారు. నటన అంటే ఆయనకు ప్రాణం అందుకే పాత్ర ఏదని కాకుండా ఆ పాత్రను ఎంత వరకు పండించగలమా అని ఆలోచించేవారట. అలా ఎన్నో స్టేజ్ లపై నాటకాలతో మెప్పించిన నాగేశ్వర రావును ప్రముఖ సీనియర్ టాలీవుడ్ నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడలోని ఓ రైల్వే స్టేషన్లో నాగేశ్వరరావు ను చూసి సినిమాలో నటించే అవకాశమిచ్చారు. అలా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు ఈ తార జువ్వ. సుదీర్ఘ కాలం సినీ ప్రయాణం చేశారు. సుమారు 75 సంవత్సరాలు వరకు ఆయన సినీ పరిశ్రమలో రాణించారు. ఆనాటి ఇండస్ట్రీని ఏలిన రారాజులుగా అన్న ఎన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వాళ్ళే మొదట గుర్తొస్తారు. పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అరుదైన, ఎంతో విశిష్టమైన పురస్కారాలను అందుకున్నారు.
 
తన నటనతో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసారు. తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో 256 సినిమాలకు పైగా నటించారు. ఆయన నటించిన చివరి  చిత్రం “మనం”. ఇందులో తన కుటుంబ నట వారసులైన నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ లతో కలిసి నటించారు. ఈ రోజు నాగేశ్వరరావు పుట్టిన రోజు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను గుర్తు తెచుకున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR

సంబంధిత వార్తలు: