కారణాలు ఏవయినా డ్యాన్సింగ్
బ్యూటీ సాయి పల్లవి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో నటించేందుకు నో చెప్పిందని అంటుంటారు. అయితే చిన్న
హీరో చిన్న
సినిమా అనే భేదాలతో సినిమాలను రిజెక్ట్ చేస్తారు కానీ సాయి పల్లవి మాత్రం బడా హీరోల సినిమాలకు నో చెప్పడంతో అంతా షాక్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో నటించేందుకు సాయి పల్లవి నో చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై
మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ ప్రీరిలీజ్
ఈవెంట్ లో అందరి ముందు అడిగేశాడు దాంతో సాయి పల్లవి ఒక్క సారిగా షాక్ అయ్యింది.
మెగాస్టార్ ప్రీ రిలీజ్
ఈవెంట్ లో మాట్లాడుతూ... సాయి పల్లవిని
ఫిదా సినిమాలో చూసే వరకూ ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పారు.
ఫిదా సినిమాలో
సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ
అమ్మాయి అని ఆశ్చర్యపోయినట్టు
మెగాస్టార్ చెప్పారు.
వరుణ్ తేజ్ వచ్చి సినిమాలో ఎలా చేశాను
డాడీ అని అడిగితే.... సారీరా నేను నిన్ను చూడలేదు... సాయి పల్లవిని చూశాను అని చెప్పానని
మెగాస్టార్ అన్నారు. తనకు యాంకర్ సుమ, సాయి పల్లవిని చూస్తే చెల్లెలిలా అనిపిస్తారని ఆచార్య సినిమాలో
సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సిందని కానీ ఆమె నో చెప్పిందని
చిరంజీవి అన్నారు. దాంతో ఒక్కసారిగా సాయి పల్లవి నిల్చుని ఎంతో ఆందోన చెందింది.
అలా అనకూదని తనకు
రీమేక్ సినిమాలలో నటించడం అంటే బయం అని అందుకే నటించడానికి ఒప్పుకోలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. తనకు
మెగాస్టార్ అంటే ఇష్టమని తనను అందరూ
మెగాస్టార్ ను కలిసారా అని అడుగుతారని చెప్పింది. ఇక
మెగాస్టార్ నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదని జోకులు చేశారు. సాయి పల్లవి వండర్ ఫుల్ డాన్సర్ అని ఆమె పక్కన హీరోగా డాన్సులు చేయాలని ఉందని
మెగాస్టార్ చెప్పారు. తనతో అప్పట్లో రాధ,
శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారని
మెగాస్టార్ వ్యాఖ్యానించారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేదని... చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడని
మెగాస్టార్ అన్నారు.