తండ్రిలాగే చరణ్ కూడా నిర్మాతల హీరో...

VAMSI

టాలీవుడ్ లో మెగా స్టార్ అంటే ఒక సంచలనం, టాలెంట్ సునామీ, బ్రేక్ డాన్స్ రూప కర్త ఇలా ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి అద్బుతం అంశతో చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. పేరుకి మెగా స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తన కృషితో, పట్టుదలతో వాటికి మించిన ప్రతిభతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చిరుత సినిమా తో తెరంగేట్రం చేసిన చెర్రీ చిరుత పులిలా తన సత్తా చాటాడు. తండ్రి లోని గ్రేస్, బాబాయ్ పవన్ కళ్యాణ్ లోని పవర్ ని కలిపి కనబరిచిన రామ చరణ్ తేజ్ కి ప్రేక్షకులు మెగాపవర్ స్టార్ అని పట్టం కట్టారు. ఎప్పటికప్పుడు తనలో కొత్తదనాన్ని చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు చెర్రీ. అతడి టాలెంట్ గురించి, పవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే అగ్ర హీరోగా ఎదిగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ తేజ్ అభిమాన సైన్యం అనంతం. టాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో చెర్రీ కూడా ఒకరు. కానీ తన పారితోషకం విషయంలో నిర్మాతలను డిమాండ్ చేయడని కొందరు హీరోల్లా ఆంక్షలు పెట్టి విసిగించరని చెర్రీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఈ విషయంలో చిరంజీవినే ఫాలో అయ్యాడా అనిపిస్తుంది. అయితే ఎంత గొప్ప వ్యక్తులైన అర్దం చేసుకునే భాగస్వామి దొరకకపోతే ఎన్ని ఉన్నా జీవితం అసంపూర్ణమే. అయితే ఈ విషయంలో చెర్రీ చాలా లక్కీ అనే చెప్పాలి. కోడలిగా మెగాస్టార్ ఫ్యామిలీ లోకి అడుగు పెట్టిన ఉపాసన గొప్ప బ్యాగ్ గ్రౌండ్ కలిగి ఉన్నా తనలో గర్వం ఏ మాత్రం లేదు.
రామ్ చరణ్ తేజ్ కి తగిన భార్యగా తనని అర్దం చేసుకుని కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ఎప్పుడు ముందుంటారు ఉపాసనా. ప్రతి విషయంలోనూ చెర్రీకి చేదోడు వాదోడుగా ఉంటూ కలసి జీవన ప్రయాణాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. ఈమె కుటుంబ బాద్యత మాత్రమే కాకుండా సమాజానికి కూడా అనేకరకాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. కరోనా సమయంలోనూ ఎంతోమంది ప్రజలకు దీనిపై అవగాహన కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: