కుర్రోడే కానీ.. విలన్ పాత్రలో ఇరగదీశాడు?

praveen
ఇటీవల కాలంలో ఎంతో మంది యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇలా హీరో గా ఎంట్రీ ఇచ్చిన వారు  ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ యువ హీరో ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.



 ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. అదే సమయంలో అటు విలన్ పాత్రలు చేసేందుకు కూడా వెనకడుగు  వెయ్యలేదు.  ఎవరూ ఊహించని విధంగా ఏకంగా నాచురల్ స్టార్ నాని ని ఢీకొట్టే విలన్ పాత్రలో నటించి తన విలనిజంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో ఒక సైకో విలన్ పాత్రలో నటించాడు  కార్తికేయ. ఏకంగా డబ్బు పేరు కోసం ఎవరిని చంపడానికి అయినా వెనకడుగు వేయని పాత్రలో నటించి తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి.



 మొదట కార్తికేయ విలన్ పాత్రలో సెలెక్ట్ చేసిన సమయంలో..  ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ చేస్తున్నాడు..  అంత అనుభవం కూడా లేదు.. అలాంటి వాడు విలన్ పాత్రలు చేయగలడా అని అనుకున్నారు అందరు..  కానీ గ్యాంగ్ లీడర్ సినిమా లో కార్తికేయ విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తర్వాత.. కుర్రోడే కానీ..  విలన్ పాత్రలో ఇరగదీశాడు అని అనుకున్నారు. అంతేకాదు ఇక గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ పాత్రలో నటించిన తర్వాత.. అటు తమిళంలో కూడా ఒక స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర అవకాశాన్ని దక్కించుకున్నాడు యువ హీరో కార్తికేయ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: