సిటీ వద్దనుకొని అడవుల్లోకి వెళ్తున్న హీరోలు..!
చిరంజీవి, రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. అన్యాయాన్ని ఎదురించడానికి అడవి బాట బాట్టిన విప్లవకారుల పాత్రతో మెగా ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా వస్తోన్న సినిమా 'భీమ్లా నాయక్'. మళయాళీ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా రూపొందుతోందీ సినిమా. ఇగో వార్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ అడివిలో షూట్ చేశారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీ వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడుదల కాబోతోంది.
అల్లు అర్జున్ కెరీర్‌లో యూనిక్ మూవీగా తెరకెక్కుతోంది 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో బన్ని ఎర్రచందనం కూలీగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ మేజర్ షూటింగ్ అడవుల్లోనే సాగుతోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 24న విడుదలవుతోంది. రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా 'విరాటపర్వం'. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో రానా నక్సలైట్‌గా నటించాడు. విప్లవం, ప్రేమ రెండిటి కలయికగా రూపొందిన ఈ సినిమా మేజర్ షూటింగ్ అడవుల్లోనే జరిగింది. ఇక ఈ మూవీ సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. అయితే లాక్‌డౌన్‌తో వాయిదా పడుతూ వస్తోంది. వైష్ణవ్‌తేజ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'కొండపొలం'. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కుతోందీ సినిమా. ఇక ఈ మూవీలో కూడా ఫారెస్ట్ సీన్స్ ఉన్నాయి. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 8న రిలీజ్ అవుతోంది.