వినాయక దర్శనం మోక్ష ప్రదాయకం !

Seetha Sailaja

ప్రతి వ్యక్తి తాను తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా జరగాలని ఆశిస్తాడు. ఈ విషయంలో తన శక్తికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఒక ఆధ్యాత్మిక శక్తి పై నమ్మకాన్ని పెంచుకుంటాడు ఆ నమ్మకమే దైవశక్తి. మన హైందవ ధర్మంలో ఎందరో దేవుళ్ళు మరెందరో దేవతలు ఉంటారు. వీరందర్నీ ఎదో ఒక సందర్భంలో ప్రత్యేకంగా పూజించడం మన సాంప్రదాయం.


అలాంటి సాంప్రదాయాలలో ‘వినాయకచవితి’ పూజ చేసుకోవడం అనాదిగా వస్తోంది. విఘ్నాలు తొలిగించి మనకు అన్ని విషయాలలోనూ విజయాన్ని కలిగించమని ‘మహాగణపతి’ ని వేడుకోవడం యుగయుగాలుగా కొనసాగుతోంది. అయితే ఈ గణపతి ‘అష్ట గణపతులు’ గా మనదేశంలో చాలచోట్ల కనిపిస్తారు అన్న విషయం చాలకొద్దిమందికి మాత్రమే తెలుసు. మయూర గణపతి – చింతామణి గణపతి – సిద్ది వినాయక గణపతి రూపాలతో పాటు గణేషుడు బల్లాలేశ్వరుడు గా విఘహరుడు గా వర వినాయకుడు గా గిరిజాత్మాజ్ వినాయకుడు ఇలా వివిధ అష్ట రూపాలలో దర్శినమిస్తాడు.

ఈ అష్ట వినాయక క్షేత్రాలకు సంబంధించి వివిధ స్థల పురాణాలు ఉన్నాయి. ఒకే యాత్రలో దేశంలోని ఈ ఆలయాలు అన్నీ దర్శిస్తే ఇక మళ్ళీ జన్మంటూ ఉండదు అంటారు. సాధారణంగా ఆంజనీయ స్వామిని సింధూరంతో పూజిస్తారు కానీ జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారిలో ఉన్న సింధూర గణపతిని దర్శించుకుంటే అన్ని కోరికలు తీరుతాయి అని అంటారు. ఈ క్షేత్రంలోని గణపతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల నమ్మకం. పూణే కి దగ్గరలో చింతామణి గణపతి గా పేరుగాంచిన ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఈ ఆలయంలో ఉన్న గణపతి కి తమ బాధలు చెప్పుకుంటే ఆ ఆలయంలో కపిల మహాముని ప్రతిష్టించిన చింతామణి వల్ల ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయి అంటారు.


కులమతలాకు అతీతంగా ధనిక పేద వర్గాలు అన్న తారతమ్యం లేకుండా గణపతి అందరి వాడుగా యుగ యుగాల నుండి భారతీయుల జనజీవితంలో పెనవేసుకుని ఉన్నాడు. ఈ వినాయక చవితి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ జయాన్ని ప్రసాదించి అందరు ఆరోగ్యంగా ఆనందం గా ఉండాలని ఆ గణేష్ డుని ప్రార్ధిస్తూ ఇండియా హెరాల్డ్ వినాయకచవితి శుభాకాంక్షలు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: