డ్రగ్స్ కేసులో హాజరైన రవితేజ.. ఏమి చెప్పాడంటే..!

Divya
ఇప్పుడు ఎక్కువగా టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వ్యవహారం బాగా హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి నిశ్శబ్దంగా ఉన్న ఈడీ అధికారులు మళ్లీ తెరపైకి ఈ కేసును తీసుకువచ్చారు. ఇక ఈ నెల కొంత మంది సెలబ్రిటీలను కూడా విచారించడం జరిగింది. ఇక రవితేజ కూడా తాజాగా అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే హాజరైన కొంతమంది నటులను ఈడీ ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా రవితేజని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక అతనితో పాటు అతని డ్రైవర్ శ్రీనివాసుని కూడా విచారించడం జరిగింది. ఈరోజు ఉదయాన వీరిద్దరు ఈడీ అధికారుల ముందు హాజరైనట్లు తెలిసింది. డ్రగ్స్ కేసు ఒకటే కాకుండా మనీ లాండరింగ్ వంటి వ్యవహారం కూడా బయటపడింది.
ఇక ఈ విషయంపై హీరో రవితేజ ను విచారించగా, ఆయనకు సంభందించిన బ్యాంకు ఖాతాను కూడా పరిశీలించారు. ఇక అంతే కాకుండా అనుమానం ఉన్న కొన్ని ప్రశ్నలను హీరో రవితేజను అడిగినట్లు సమాచారం. ఇక డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న కెల్విన్ తో ఏమైనా పరిచయం ఉందా అంటూ ఈడీ అధికారులు రవితేజను అడిగారట.
ఇక గత నటీనటులను కూడా ఇలాంటి ప్రశ్నలతోనే అధికారులు ప్రశ్నించడం జరిగింది. రవితేజ తో ఇంకా విచారణ సాగిస్తున్నారు. ఈ విచారణ ఎన్ని గంటల పాటు కొనసాగుతుందో.. ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయో అని పలువురు నటులు ఎదురు చూస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇకపోతే ఇప్పటివరకు రవితేజ నోరుమెదపడం లేదని, నిజంగానే డ్రగ్స్ కేసుకు రవితేజ కు సంబంధం ఉందా..? లేక ఎవరైనా ఆయన పేరును ఇరికించారా..? అనే అనేక కోణాల్లో కూడా అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఈ విషయాలపై ట్విట్టర్లో త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపింది.విచారణ ముగిసేసరికి రవితేజ ఎలా స్పందిస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: