నీ మీద ప్రతీకారం తీర్చుకుంటా.. షణ్ముక్ కి వార్నింగ్ ఇచ్చిన లోబో?

praveen
బుల్లితెరపై బిగ్బాస్ రచ్చ మొదలైపోయింది.. మళ్లీ బుల్లితెర ప్రేక్షకులు అందరూ బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరి పై కూడా ఒక కన్నేసి ఉంచారు.  ఈ క్రమంలోనే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుంచే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది.  గొడవలు జరగడం మొదలైంది.  ఇలా తమకు తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి తమకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు డేగ కన్నుతో వీక్షిస్తున్నారు ప్రేక్షకులు.  బిగ్బాస్ కెమెరాలు కూడా అసలు సిసలైన కంటెంట్ ని చూపిస్తూ ప్రేక్షకులకు ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ని పంచుతున్నాయ్.



 అయితే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన లోబో సూపర్ ఎంటర్ టైనర్ గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఎంతో యాక్టివ్గా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉన్నాడు లోబో. అయితే ఇక నిన్నటి ఎపిసోడ్ లో లోబో ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ పై ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది. సిరి కి స్పెషల్ పవర్ వస్తుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్ ని ఎంపిక చేసుకొని ఒకరిని యజమానిగా ఒకరిని వారికి సపర్యలు చేసే పని మనిషిగా ఎంపిక చేసుకోవాలని బిగ్బాస్ చెప్పడంతో.. ఇక యజమాని గా షణ్ముఖ్ జస్వంత్.. పనివాడిగా లోబోని సెలెక్ట్ చేసుకుంది సరి.



 ఈ టాస్క్ పూర్తి అయ్యేంత సేపు  షణ్ముక్ ని యజమాని గా భావిస్తూ లోబో సపర్యలు చేయాల్సి ఉంటుంది. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్న షణ్ముఖ్ జస్వంత్ వెంటనే లోబో తో మసాజ్ చేయించుకున్నాడు. తర్వాత హౌస్మేట్స్ ని ఇమిటేషన్   చేయాలి అంటూ చెప్పటంతో.. లోబో అందరిని ఇమిటేట్ చేసి నవ్విస్తాడు. ఇక ఆ తర్వాత ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ తన బట్టలను కూడా ఉతికించాడు. ఆ సమయంలో బాత్ రూమ్ దగ్గరికి చేరుకున్న రవి స్నానం చేస్తాను బకెట్ కడిగి ఇవ్వు అంటూ అడగడం మొదలు పెట్టాడు. దీంతో ఇక లోబోకి కోపం వచ్చింది. రేయ్ షణ్ముఖ్ జస్వంత్ నాకు కూడా టైం వస్తుంది అప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తా ఇంతకంటే ఎక్కువ ప్రతీకారం తీర్చుకుంటా అంటూ లోబో సీరియస్ గా చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: