ఇదేం నరాల వీక్నెస్ కాదు...కేవలం ఒక అలవాటు...పోసాని కామెంట్స్..!

Pulgam Srinivas
పోసాని కృష్ణమురళి ఈయన నటన ఎంత విలక్షణంగా ఉంటుందో, ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ప్రతి విషయం పై స్పందించే విధానం మరియు తన నటన చాలా విలక్షణంగా ఉంటూ జనాలను ఎంతో ఆకట్టుకుంటుంది. సినిమాల్లో నటిస్తూ తనదైన పనితీరుతో సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి పోసాని కృష్ణ మురళి కి ఒక వింత అలవాటు కూడా ఉంది. ఆ అలవాటే షర్ట్‌ని పదే పదే లాక్కుంటూ డిఫరెంట్ మేనరిజం చూపిస్తుంటారు. ఆయన ఏ ఫంక్షన్ లో ఉన్న అదే పద్ధతి , ఏ సినిమా లేదా ఇతర ప్రెస్ మీట్ లో ఉన్న krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి గారి పద్ధతి ఇలాగే ఉంటుంది. ఆయనకు ఏమైనా వ్యాధి ఉందా, ఎందుకు ఇలా ఎప్పటికీ ఇలా చేస్తూ ఉంటారు అనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది ఉంటుంది. అయితే ఇలాంటి సందేహాలకు పోసాని కృష్ణ మురళి క్లారిటీ ఇచ్చారు. ఈ అలవాటు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు , ఎందుకు పోవటం లేదో తెలియడం లేదు.


 నా షర్టు ను పదేపదే లాక్కునే అలవాటు నాకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. నా భార్య కూడా చాలా సార్లు చేయి అక్కడ నుండి తీయండి పదేపదే అలా చేయకండి అని చెబుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ అలవాటు కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమాల్లో కూడా అలా షర్ట్ ను పదే పదే లాక్కుంటూ ఉంటే మా ఆవిడ మీకు ఏదైనా జబ్బు ఉంది అని అందరూ అనుకుంటారు అని చెబుతోంది. ఇదేం నరాల వీక్నెస్ కాదు, ఇది ఒక అలవాటు అంతే. ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. షూటింగ్ సమయంలో కూడా ఇలా చేస్తూ ఉంటే చాలా మంది వెక్కిరించారు. బాలకృష్ణ , వెంకటేష్ లు ఏడిపిస్తూ ఉంటారు. నా డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా సరదాగా కామెడీ చేస్తూ ఉంటారు. అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి తన మ్యానరిజం గురించి సరదాగా చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: