బిగ్ బాస్ 5: జెస్సీకి అండగా బిగ్ బాస్ విన్నర్...

Purushottham Vinay
ఇక ఆదివారం మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 చాలా ఆసక్తిగా సాగుతుంది.ఇక అప్పుడే గొడవలు కూడా మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మధ్య అనేక వివాదాలు తలెత్తడం జరిగింది. ఒకరి నెగెటివిటీను మరొకరు బయట పెడుతూ తమ కారణాలు చెబుతూ రచ్చ రచ్చ చేయడం జరిగింది.ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ అనేది జరిగింది. ఇక ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో కారణాలు చెప్పే క్రమంలో వారితో జరిగిన మిస్ కమ్యూనికేషన్ వలన ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. అయితే అక్కడ ఎక్కువమంది ఇంటి సభ్యులు కూడా మోడల్ జెస్సీను నామినేట్ చేయడం జరిగింది.ఇక జెస్సీ మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ తో హౌస్ లో అడుగుపెట్టాడు.ఇక ఆ ఇంటిలో జెస్సీ మాట్లాడిన తీరు అనేది తమకు ఏమాత్రం నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది.


నామినేషన్ సమయంలో విశ్వకు, జెస్సీకు మధ్య జరిగిన డిస్కషన్ లో జెస్సీ బాగా డిస్టర్బ్ అయ్యాడు.ఇక ఆ తరువాత డాన్స్ మాస్టర్ అయిన నటరాజ్  కూడా జెస్సీను నామినేట్ చేస్తూ.. 'చిన్నోడా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అయాకుడిలా ఉన్నావు, ఇక్కడ అమాయకత్వం చూపిస్తే తొక్కేస్తారు. నీకు ఈ హౌస్ సెట్ అవ్వదు. అందుకే నామినేట్‌ చేస్తున్నాను ' అంటూ చెప్పగా వెంటనే జెస్సీ ఎమోషనల్ అయ్యి బాగా కన్నీరు పెట్టుకున్నాడు.ఇక దీంతో అందరూ కూడా జెస్సీని ఓదార్చారు. దీనిపై బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా జెస్సీకి సపోర్ట్ చేస్తూ స్పందించడం జరిగింది. జెస్సీని ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ' ఇక నా తర్వాత, బిగ్ బాస్ సీజన్‌ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్‌ అస్సలు ఏడవకూడదు. తమ సూపర్ యాటిట్యూడ్‌ తో ఫైట్ చేసి జనాల ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మాత్రం ముందుగా హౌజ్‌ నుంచి నువ్వే బయటకు వస్తావు. కాబట్టి జాగ్రత్తగా ఆడు. ఆల్‌ ది బెస్ట్‌' అంటూ తన స్టోరీలో రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: