యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ లో ఇన్ని రోజుల పాటు బిజీగా ఉన్నాడు. తాజాగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై తన అభిమానుల దృష్టి పడింది. ఇప్పటికే ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్నా ఇంత కాలం అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి సినిమాలో బిజీగా ఉండడం. మరియు కొరటాల శివ కూడా చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, రామ్ చరణ్, ప్రధాన పాత్రలో పూజ హెగ్డే మరొక హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తుంది.కానీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం.
అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో, వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీజనం లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించడమే. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం తో రెండవ సినిమా అంతకుమించి ఉంటుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.