
వావ్.. సుధీర్ కి రష్మీ ఐ లవ్ యు చెప్పబోతుందా?
ఫిదా దాదాపు తొమ్మిదేళ్ల నుంచి బుల్లితెరపై సూపర్ జోడి గా కొనసాగుతున్నారు యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్.
అయితే ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ రష్మీ ని ప్రేమలో పడేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసాడు.. ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్స్ లను చేశాడు.. ఎన్నో మ్యాజిక్ ట్రిక్స్ కూడా చేశాడు. అంతేకాదు ఎన్నో కవితలు కూడా చెప్పాడు. అయితే సుదీర్ చెప్పిన కవితలకు బుల్లితెర ప్రేక్షకులు పడి పోయారు కానీ యాంకర్ రష్మీ మాత్రం నేను లేదు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. కానీ ఎంతో ప్రేమగా సుధీర్ తో మాట్లాడుతూ ఇక తాను సుధీర్ ను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది రష్మీ.
అయితే సుధీర్ కి రష్మీ ప్రపోజ్ చేసి ప్రేమగా ఒక కౌగిలి ఇచ్చే రోజు ఎప్పుడు వస్తుందా అని బుల్లితెర ప్రేక్షకులందరూ ఎన్ని రోజులనుంచి ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వినాయక చవితికి ఆరోజు రాబోతున్నట్లు తెలుస్తుంది. వినాయక చవితి రోజున రష్మి సుడిగాలి సుధీర్ కి ఐ లవ్ యు చెప్పబోతుందా అంటే ఇక ఈ వీడియో చూస్తే మాత్రం అవును అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఊరిలో వినాయకుడు అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా సుధీర్ కోసం ఒక స్పెషల్ పర్ఫామెన్స్ చేస్తోంది రష్మి. ఇక ఆ తర్వాత ఆ చివరి మాట కూడా చెప్పేయ్ అని రోజా అడగగా.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రష్మి సుడిగాలి సుధీర్ కి ఐ లవ్ యు చెబుతుంది అనుకుంటున్న సమయంలో.. ప్రోమో ఎండింగ్ ఉంటుంది. ఇక ఏం జరుగుతుంది అన్నది మాత్రం పూర్తి ఎపిసోడ్ చూస్తే తెలుస్తోంది.