బిగ్ బాస్ 5 : నాగార్జున చెప్పింది నిజమే.. మంటలు మండిపోతున్నాయి?

praveen
తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా ఉన్న బిగ్బాస్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవల ఎంతో గ్రాండ్ గా బిగ్బాస్ ఐదవ సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ ఐదో సీజన్లో ఎంతోమంది ఫేమస్ సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి వెళ్లారు.  అయితే ఇక ఈ సారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో అనే దానిపై కూడా అంత ఆసక్తి నెలకొంది.  ఇకపోతే బిగ్ బాస్ షో ప్రారంభించిన రోజే నాగార్జున ఒక విషయం చెప్పారు..  ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అయిదు రెట్లు ఎక్కువ ఉండబోతుందని..  కాంట్రవర్సీ ఐదురెట్లు ఎక్కువ ఉండబోతుందని..  ఎమోషన్ ఐదురెట్లు ఎక్కువ ఉండబోతుందని..  ఇలా అన్నీ కూడా మునుపటి సీజన్ తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటూ నాగార్జున చెప్పారు.



 నాగార్జున అలా చెప్పిన సమయంలో ఏదో కార్యక్రమం పై ఆసక్తిని పెంచడానికి అలా చెప్పి ఉంటారులే..  ఇక ఈ బిగ్బాస్ సీజన్ కూడా గత సీజన్లో ఇలాగే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న గొడవలు చూస్తుంటే మాత్రం.. అవునవును నాగార్జున చెప్పింది అక్షరాల నిజం అన్నట్లుగానే కనిపిస్తుంది కదా అని అనుకుంటున్నారు.  అవును మరి ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా కొన్ని రోజుల వరకు అంతా ఒకరికి ఒకరు స్నేహితులుగానే ఉన్నారు.



 ఇక ఒక వారం గడిచిన తర్వాత ఒకరితో ఒకరికి గొడవలు జరగడం మొదలైంది. కానీ ఇక బిగ్బాస్ 5 సీజన్ లో మాత్రం వచ్చిన రోజు నుంచి గొడవలు పడటం మొదలు పెట్టారు. ఇక నామినేషన్ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్స్ చేసుకున్నారు. మొదటి రోజే ఒక రేంజ్ లో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఇక ఇటీవల విడుదలైన బిగ్ బాస్ ప్రోమో చూస్తే మాత్రం వామ్మో బిగ్బాస్ లో రెండవ రోజే గొడవ మొదలైంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక మరికొంతమంది అసలు సిసలైన బిగ్ బాస్ సీజన్ ఇదే అనే కామెంట్స్ సైతం పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: