మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్...ఆచార్య అప్పుడు కూడా కష్టమేనట..!

Pulgam Srinivas
చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని పోస్టర్లు, టీజర్, ఒక పాట ను చిత్రబృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మొదట దసరాకు విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' సినిమా దాదాపుగా విడుదల క్యాన్సల్ అయినట్లు వార్తలు రావడంతో, ఆస్థానంలో చిరంజీవి 'ఆచార్య' సినిమాను తీసుకువస్తాడు అని వార్తలు వచ్చాయి. కాకపోతే షూటింగ్ కాస్త మిగిలి ఉండడంతో సినిమాను దసరాకు విడుదల చేయడం కష్టమే అని వార్తలు వచ్చాయి.


ఆ తర్వాత సినిమా పనులు అన్నీ ముగించుకుని దీపావళికి విడుదల చేస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం దీపావళి కూడా కష్టమే అని తెలుస్తోంది. ఒకవేళ 'ఆచార్య' సినిమా దీపావళికి కూడా విడుదల చేయనట్లయితే, సంక్రాంతికి రిలీజ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు సంక్రాంతికి ఆల్రెడీ డేట్లను ప్రకటించి ఉన్నాయి.
దీనితో మెగాస్టార్ చిరంజీవి సినిమా దీపావళికి విడుదల కానట్లయితే సమ్మర్ కి విడుదల చేయడం మంచిది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా తో పాటు 'లూసిఫర్' రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమాలలో నటిస్తున్నాడు. మరియు వీటితోపాటే బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి చిరంజీవి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: