రాజకీయ ఎన్నికలు ఎంత వేడెక్కిస్తాయో అందరికి తెలిసింది. అయితే తాజాగా MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు కూడా అంతే హీట్ పెంచుతున్నాయి. అసలు ఎన్నికలు కూడా ప్రకటించకుండానే బరిలోకి దిగుతున్నా అంటూ ప్రకాష్ రాజ్ మొదలుకొని మంచు విష్ణు, హేమ సివీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు తెరమీదకు వచ్చారు. అక్టోబర్ 10న ఎన్నికల నిర్వహణకు క్రమశిక్షణా సంఘం ప్రకటన జారీ చేసిన అనంతరం ఎవరికి వారు తమ వర్గాన్ని సిద్ధం చేసుకుని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈసారి ప్రధాన పోటీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ మధ్యనే సాగనుంది.
ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్ నాగబాబు నుంచి సపోర్ట్ రావడంతో ప్రకాష్ రాజ్ ఫుల్ జోష్ తో ప్రచారం చేస్తున్నారు. గెలుపు కూడా మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ-కృష్ణంరాజు- బాలకృష్ణ అండదండలతో ఈ సారి మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీపడుతున్నారు. అయితే మంచు విష్ణుకి ఎన్నికలు జరగకముందే భారీ షాక్ తగిలింది. మంచు విష్ణు ఈసారి మహిళల సపోర్ట్ దొరుకుతుందని భావించారు. కానీ ఇంతలోనే ఊహించని జంప్ లు విష్ణు కి షాక్ తగిలించాయి
జీవిత రాజశేఖర్ మంచు విష్ణు కి సపోర్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో జీవిత రాజశేఖర్ నిర్ణయం మార్చుకున్నారు. జీవిత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తుండడంతో ఎన్నికలు మరింత హీట్ ని పెంచాయి. మొదట అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన జీవిత రాజశేఖర్ నరేష్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేయాలని తీసుకున్నారు నిర్ణయం. కానీ ఇంతలోనే జీవిత తన ఆలోచనను మార్చుకుని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి సెక్రటరీగా పోటీగా చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయడం, ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్ నుంచి సపోర్ట్ చేయడంతో అందరికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీవిత రాజశేఖర్, హేమ ప్రకాష్ రాజ్ ప్యానెల్ వైపు మరలడానికి కారణం మెగా రాజకీయమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రకాష్ రాజ్ కి ఈ ఎన్నికల బరిలో దిగి ఉద్దేశం లేదని కొందరు సినీ పెద్దలు కావాలని వెనక నుండి నడిపిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.