విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్?

Suma Kallamadi
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రతి హీరో కూడా తమ సినిమాల షూటింగ్ పునః ప్రారంభించారు. అంతేకాదు, మిగిలిపోయిన షూటింగ్ ను చాలా మంది హీరోలు పూర్తి కూడా చేశారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమా 'లైగర్' షూటింగ్ ప్రారంభించలేదు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ రీస్టార్ట్ కాకపోవడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. సినిమా ప్రారంభం కాకపోవడానికి కారణం ఏంటని చాలామంది ఆరా తీయడం కూడా ప్రారంభించారు. చిత్ర బృందం గురించి కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ప్రేక్షకుల్లో మరింత అసంతృప్తి పెరిగిపోయింది.




ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం నుంచి ఫ్యాన్స్‌కు ఒక గుడ్‌న్యూస్ అందింది. ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, వచ్చే వారంలో 'లైగర్' సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. నెక్స్ట్ వీక్ సినీ బృందం షూటింగ్ నిమిత్తం గోవా వెళ్లనుందని సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది.



ఈ సినిమాకి దర్శకుడు అయిన పూరీ జగన్నాథ్, నిర్మాత అయిన ఛార్మి కౌర్ డ్రగ్స్ కేసు విషయంలో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అందుకే వారు సినిమా చిత్రీకరణను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటీవలే విచారణ పూర్తి కావడంతో వీరిద్దరు కూడా ఫ్రీ అయ్యారు. దాంతో సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి రెండవసారి విజృంభించక ముందు లైగర్ చిత్రాన్ని సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. దాంతో ముందస్తుగా ముహూర్తం పెట్టుకున్న తేదీకి లైగర్ సినిమా రిలీజ్ కాలేకపోతోంది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయనున్నారు. కరణ్ జోహార్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: