రెబల్ స్టార్
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బాహుబలి లాంటి దేశం గర్వించదగ్గ కళాఖండం
సినిమా చేసి దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక
ప్రభాస్ అంటే ఇండియాలోనే ఓ పెద్ద పాన్
ఇండియా హీరో. ఎంత మంది పాన్
ఇండియా హీరోలు వచ్చిన
ప్రభాస్ స్థానం మాత్రం ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉంటుంది. బాహుబలి,
సాహో లాంటి సినిమాలతో ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న
ప్రభాస్ మనసు
వెన్న లాంటిది. ఎంత ఎదిగిన కాని ఒదిగి వుండే స్వభావం కలవాడు ప్రభాస్.మంచి మనసున్న హీరోగా
ప్రభాస్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇగో లేని స్టార్ గా
ప్రభాస్ మంచి పేరు తెచ్చుకున్నాడు.ప్రభాస్ ని అలా ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకున్నాడు.చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎప్పుడు పెద్ద హీరోలని కొంచెం క్రేజ్ వచ్చిన హీరోలని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వారి
సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి ఇంకా
ఆడియో లాంచ్ లకి వెళ్తుంటారు. కేవలం వాళ్లనే ఎంకరేజ్ చేస్తుంటారు.
కాని మన
డార్లింగ్ ప్రభాస్ అలా కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొత్త కొత్త హీరోలను చిన్న హీరోలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
సుధీర్ బాబు,
సంతోష్ శోభన్, తన మిత్రుడు గోపి చంద్ ఇంకా
నవీన్ పోలిశెట్టి లాంటి నటులను ప్రోత్సాహించి వారి ఫంక్షన్స్ కి అతిధిగా వెళతాడు. ఇంకా వారిని పలువిధాలుగా ఎంకరేజ్ చేస్తాడు. అలాగే చిన్న సినిమాలని కూడా బాగా రెస్పెక్ట్ చేసి ఎంకరేజ్ చేస్తాడు మన డార్లింగ్. చిన్న హీరోలకు అండగా నేనున్నా అంటూ వారికి తన సన్నిహిత బ్యానర్ యూవి క్రియేషన్స్ లో సినిమాలు చెయ్యడానికి అవకాశాలు కల్పిస్తాడు ప్రభాస్. ఇంత మంచి మనసు వున్న
ప్రభాస్ ని అందరూ కూడా తమ
డార్లింగ్ లా భావించి ఆరాధిస్తారు.ఇక ప్రస్తుతం
ప్రభాస్ రాధే శ్యాం పనుల్లో బాగా బిజీగా వున్నాడు. ఆ సినిమాతో పాటు వరుసగా సలార్, ఆదిపురుష్, లాంటి పాన్
ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇక
నాగ్ అశ్విన్ తో కూడా ఓ ప్రయోగాత్మక పాన్
ఇండియా సినిమాని చేస్తున్నాడు
రెబల్ స్టార్ ప్రభాస్.