చీరకట్టులో మెరిసిపోతున్న నేచురల్ బ్యూటీ.. ఫొటోలు వైరల్..!

Divya
ఇటీవల చాలా మంది హీరోయిన్లు మోడ్రన్ గా కనిపించడం కోసం రకరకాల దుస్తులు ధరించి ఫోటో షూట్ చేస్తున్న విషయం తెలిసిందే . కానీ ఇప్పుడు మన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం అందమైన చీరకట్టులో ఫోటోషూట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు పగడపు రంగు చీరలో ఆమె గాలిని ఆస్వాదిస్తూ ఉన్నట్లుగా ఈ ఫోటోలో మనం ఆమెని గమనించవచ్చు..

ఈరోజు సాయి పల్లవి ఫోటోలను తన సోదరి పూజ తీయడంతో , సాయి పల్లవి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చక్కగా ఎండను , గాలిని ఆస్వాదిస్తూ ఉన్నట్లు, పగడపు రంగు చీరలో మెరిసిపోతూ అద్భుతంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలను చూసిన సాయిపల్లవి అభిమానులు ఆశ్చర్యం తో పాటు ఆనందం లో కూడా మునిగిపోతున్నారు. ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే, ఫ్యామిలీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.



ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేస్తామని చెప్పినప్పటికీ , కొన్ని మిస్టేక్ లో ఉండడంతో సినిమాను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఆరోజు థియేటర్లలో విడుదల కానుంది. అంతే కాదు నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ అనే చిత్రంలో కూడా సాయిపల్లవి నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే..

ఇక ఈమె ఈ రోజు షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తున్నాయి.. ఫోటోలను సాయిపల్లవి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. నా చెల్లెలకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ ఫోటోలు చాలా నైపుణ్యంగా వచ్చాయి.. అంటూ సాయిపల్లవి తెలిపింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు , ఆనందాన్ని వ్యక్తం చేయడంతోపాటు షేర్ చేసిన కొద్ది సమయంలోనే కొన్ని లక్షల వ్యూస్ ను నమోదు చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: