ఒక సినిమా కథను బట్టి ఆ చిత్రంలో లో కామెడీ సీన్స్ ఉండాలా, రొమాంటిక్ సీన్స్ ఉండాలా, యాక్షన్ సీన్స్ ఉండాలా, అనేదానిని నిర్ణయించుకొని కథకు తగ్గట్టు ఆ సన్నివేశాలను చేర్చుతారు. ఇలా వీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దర్శక, నిర్మాతలు, హీరో ఐటమ్ పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఐటెం పాటలకు జనాల నుండి కూడా మంచి రెస్పాన్స్ ఉండడంతో ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. కానీ పాత కాలంలో కేవలం కొంతమంది ఐటమ్ గర్ల్స్ తో మాత్రమే ఐటమ్ పాటలను తీసేవారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. హీరోయిన్లుగా స్టార్ పొజిషన్ లో ఉన్న వారు కూడా ఈ ఐటెం పాటలో నటిస్తున్నారు. దానికి ప్రధాన కారణం రెమ్యునిరేషన్ అని కూడా చెప్పవచ్చు. ఒక సినిమాకు హీరోయిన్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఐటమ్ సాంగ్ లకు కూడా బాగానే ముట్ట చెబుతారు. మరియు సినిమాలకు కేటాయించే డేట్ లతో పోలిస్తే ఐటమ్ సాంగ్ లకు కేటాయించడం డేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఐటం పాటలలో కనిపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు .
అలా టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్న సమయంలో ఐటెం పాటలలో నటించి మెప్పించిన వారిలో శ్రేయ ఒకరు. శ్రేయ వెంకటేష్ హీరోగా నయనతార హీరోయిన్ గా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన 'తులసి' సినిమాలో 'నే చిక్కు చిక్కు బండిన్ రో అరె కదిలితే ఆగన్ రో' అనే ఐటమ్ సాంగ్ తో మెరిసింది. ఈ సాంగ్ తో శ్రియ టాలీవుడ్ ఐటమ్ పాటల ప్రేమికుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన 'పులి' సినిమా లో 'దోచేయ్ దోచేయ్' అనే పాటతో మరోసారి ఐటమ్ గర్ల్ గా కనిపించే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో ఐటమ్ గర్ల్ గా కనిపించిన శ్రేయ తనదైన రీతిలో జనాలను ఆకట్టుకుంది.