బాబోయ్.. బిగ్ బాస్ స్ఫూఫ్.. నువ్వులే నవ్వులూ?

praveen
తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక ప్రతి సంవత్సరం కూడా 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమయ్యే బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరిని కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా నాగార్జున యాంకరింగ్  అందరిని కట్టిపడేస్తుంది అని చెప్పాలి. ఇక మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి సోషల్ మీడియాలో ఎన్నో రకాల స్పూఫ్ వీడియోలు వచ్చాయి.



 ఇలా బిగ్బాస్ గురించి ఎన్ని స్పూఫ్ వీడియోలు వచ్చినా ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది ఇక ఇటీవలే మరో స్పూఫ్ ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ప్రస్తుతం మా టీవీ లో కామెడీ స్టార్స్ అనే ఒక కార్యక్రమం వస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో  సద్దాం హుస్సేన్ ప్రతివారం కూడా సరికొత్త స్కిట్ తో  ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఈ సారి బిగ్ బాస్  స్పూఫ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.



 అయితే బిగ్ బాస్ యాంకర్ గా అటు నాగార్జున కాకుండా ఏకంగా హీరో రాజశేఖర్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని సద్దాం హుస్సేన్ చూపించాడు. ఇక అటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని కూడా చూపిస్తూ కామెడీ పంచాడు సద్దాం హుస్సేన్.  ఇక ఇప్పుడు వరకు బిగ్బాస్ ద్వారా బాగా క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీలను కూడా పేరు మార్చి మళ్ళీ బిగ్ బాస్ లోకి పంపిస్తున్నట్లు స్పూఫ్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. ఇక ఇటీవల విడుదలైన  కామెడీ స్టార్స్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: