చిరంజీవి పిలిచి టిఫిన్ పెడితే ఆ హీరో వద్దన్నాడట... ?
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు ఏమి జరిగిందో చూద్దాం... ఆ రోజుల్లో చిరంజీవి సొంత ఇల్లు నిర్మించుకుని అందరినీ ఆహ్వానిస్తూ జేడీ చక్రవర్తి ని కూడా పిలిచారట. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి జేడీ చక్రవర్తి ఇలా వివరించారు. చిరంజీవి గారు అక్కడున్న అతిథులతో పాటుగా నాకు కూడా ఉప్మాను వడ్డిస్తూ చక్రవర్తి గారు ఈ ఉప్మాలో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ వేసి తింటే చాలా బాగుంటుంది అన్నాడట, కానీ నేను అవేమీ పట్టించుకోకుండా అలా చిరంజీవి గారినే చూస్తున్నాను. ఇంకా ఆయన నన్ను అడుగుతుంటే ఒకటే చెప్పాను...చిరంజీవి గారు మీరు ఉప్మా దోశలు అన్నీ వారికే పెట్టండి...నన్ను మిమ్మల్ని ఇలా చూడనివ్వండి చాలు అని చెప్పాను.
చిరంజీవి గారు నన్ను చక్రవర్తి గారు అంటుంటే ఇంత కన్నా ఈ జన్మకు ఇంకేమి వద్దు. అంత ప్రేమ అభిమానం నాకు చిరంజీవి గారు అంటే... ఎంత ఇష్టం అంటే, రుద్ర వీణ విడుదల సమయంలో వెంకటరమణ థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళాను. అప్పుడు నా వయస్సు 12 సంవత్సరాలు ఉండొచ్చు. అక్కడ నన్ను పోలీసులు పిల్లవాడిని అని కూడా చూడకుండా కొట్టారు. బొటన వేలు నొప్పిగా ఉన్నా అలానే ఒక చేత్తో బొటన వేలును పట్టుకుని సినిమా చూశాను. అంత ప్రేమ అండి చిరంజీవి గారు అంటే...ఇంత కన్నా మంచి ఉదాహరణ ఏమి చెప్పగలను అంటూ ముగించాడు జేడీ చక్రవర్తి. ఆ విధంగా చిరంజీవిపై తన కున్న అభిమానాన్ని చాటుకున్నాడు.