అత్యంత ఎత్తైన ప్రదేశంలో థియేటర్ .. ఎక్కడో తెలుసా ...?
నిజం చెప్పాలంటే ఇంత తక్కువ ఉష్ణోగ్రత గల ప్రదేశంలో మనిషి బ్రతకాలంటే కష్టం అనే చెప్పాలి. అయినాగానీ అక్కడ థియేటర్ నిర్మించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇంత అద్భుతమైన థియేటర్ ను నిర్మిచినది మరెక్కడో కాదండోయ్. ఆ థియేటర్ ను ఇండియాలోనే నిర్మించడం గొప్ప విషయం అనే చెప్పాలి. లఢక్ లో గల లేహ్ లో అనే కొండ మీద పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ అనే ఒక సంస్థ అక్కడ మొబైల్ థియేటర్ను నిర్మించింది. అక్కడ ఉండే ప్రజలకు సినిమా థియేటర్ లో సినిమా చూసే అనుభూతిని కలిగించడం కోసం ఈ వినూత్న ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటిదాకా థియేటర్ లో ఎకూల్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ప్రదర్శించారు.ఆ తర్వాత ఈ థియేటర్లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బెల్ బాటమ్ సినిమాను కూడా ప్రదర్శించారు. ఈ మొబైల్ థియేటర్ విజయవంతం కావడంతో లఢక్ ప్రాంతంలో త్వరలో మరిన్ని మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ సంస్థ తెలిపింది. కేవలం గాలితో నింపిన మెటీరియల్ ఉపయోగించి ఈ థియేటర్ను ఏర్పాటు చేసారు. కాగా ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ థియేటర్. ఉష్ణోగ్రత ఎంత తగ్గినగాని అక్కడి థియేటర్ కు మాత్రం ఎటువంటి డామేజ్ జరగదు అంట. అంతేకాకుండా లోపల కూర్చిని సినిమా చూసే వారికి కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా సినిమా చూడవచ్చట.