ఆ కారణంతోనే విజయశాంతిని 'మా' బ్యాన్ చేసింది..సీవీఎల్ నరసింహారావు కామెంట్స్..!

Pulgam Srinivas
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు రోజురోజుకు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.  'మా'  అధ్యక్ష పదవి పీఠాన్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్న సభ్యుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది. మొదట దాదాపు అధ్యక్ష పదవి ఎన్నికలకు రెండు నెలల కాలం ఉండగానే ప్రకాష్ రాజ్ నేను 'మా' అధ్యక్ష పదవికి పోటీలో దిగుతున్నాను అంటూ ప్రకటించుకున్నాడు. దీనితో ఈసారి కాస్త ముందుగానే ఎన్నికల జోరు మొదలైంది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంతలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించడంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండబోతుంది అని కొంత మంది అభిప్రాయపడ్డారు.


ఆ తర్వాత జీవితా రాజశేఖర్, హేమ, పివిఎల్ నరసింహారావు కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించడంతో ఈసారి ఎన్నికల జోరు మామూలుగా ఉండదు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ని ప్రకటించు కోగా, మంచు విష్ణు 'మా' అసోసియేషన్ కు బిల్డింగ్ లేదు అని, తను ఆ బిల్డింగ్ కట్టిస్తాను అంటూ ఇప్పటికే కొన్ని స్థలాలు చూసినట్టు వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవిత రాజశేఖర్, హేమ కూడా 'మా' అధ్యక్ష పదవిని చేపట్టడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
పివిఎల్ నరసింహారావు సినిమా పరిశ్రమలో తెలంగాణవాదాన్ని విడిపించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా పివిఎల్ నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో చిత్రపరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలు, 'మా' ఎన్నికల వ్యవహారంపై కూడా నోరు విప్పారు. విభజన చట్టం గురించి చెబుతూ ఎన్నో విషయాలను బయటపెట్టారు. చిత్రపురి కాలనీ లో జరిగిన అన్యాయాలు,  అక్రమాల గురించి కూడా సీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. పద్మాలయ, రాఘవేంద్రరావు స్టూడియోలో తెలంగాణకు భాగస్వామ్యం ఉందని సీవీఎల్ నరసింహారావు అన్నారు. సినిమా అభివృద్ధి కోసం వాటిని ఇచ్చారు కానీ ఇప్పుడు అవి రియల్ ఎస్టేట్ గా మారిపోయాయి అని
సీవీఎల్  నరసింహారావు తెలియజేశాడు. ఇక తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేసిందనే కారణంతోనే విజయశాంతి 'మా' బ్యాన్ చేసిందని, ఇప్పటికి కూడా విజయశాంతి 'మా' లో సభ్యురాలు కాదు అని, ఆమెను తొక్కేసారు అని సీవీఎల్ నరసింహ రావు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: