ఈమె RRR సినిమా హీరోయిన్ అని మీకు తెలుసా..?

Divya
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా రణం రౌద్రం రుదిరం.. ఇక ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆలియా భట్ అప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇక ఈమెను చూసి నిజంగా ఆలియా భట్ యేనా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పుడు ఆమె అంత సన్నగా అవడానికి గల కారణం ఏమిటి..? అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..



నిజానికి ఆలియాభట్ తండ్రి హిందీలో ప్రముఖ దర్శకుడు గా గుర్తింపు పొందిన మహేష్ భట్. ఈమె తల్లి పేరు సోనీ రజ్దాన్.. ఆలియా భట్ అప్పట్లో కొన్ని తన గురించి సంచలన విషయాలను కూడా తెలియచేసింది. ఇకపోతే ఆమె చాలా లావుగా, ఒక సామాన్య మధ్య తరగతి అమ్మాయి లాగా ఉండేది. ఇక తన సినీ ఇండస్ట్రీలోకి రావాలన్నా కోరికతో  ఏకంగా 30 కేజీల బరువు తగ్గి ,ఇప్పడు చూడచక్కని అందంతో, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఇకపోతే తను బరువు తగ్గడానికి కంటే ముందు తన తండ్రి దర్శకత్వం వహించే,  సినిమాల షూటింగ్ సమయంలో అక్కడికి వెళ్లేదట.

సినిమా షూటింగ్ సెట్లో అయితే చాలా రకాల భోజనాలను వడ్డిస్తుంటారు అని, వాటిని తినడం కోసం మాత్రమే నేను అక్కడికి వెళ్తాను అని కూడా చెప్పింది ఆలియా భట్. నిజానికి ఈమె మంచి భోజనప్రియులు. ఆ కారణం చేతనే అప్పట్లో చాలా బాగా తింటూ ఉండేది. అందుకే అంత బరువెక్కటానికి  కారణం అని కూడా ఆమె చెప్పడం గమనార్హం. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే చాలా నాజూగ్గా,  అందంగా కనిపించాలని అంత బరువును  తగ్గించుకొని ప్రస్తుతం మెరుపు తీగలా అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగులోకి మొదటిసారిగా ఆర్ ఆర్ ఆర్  సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: