మెగాస్టార్
చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం
చిరంజీవి కొరటాల
శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాతో పాటు
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సూపర్ హిట్
సినిమా 'లూసిఫర్'
రీమేక్ 'గాడ్ ఫాదర్'
సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరియు మరికొన్ని రోజుల్లో
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'బోలా శంకర్' మరియు
బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నటించేందుకు రెడీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే
చిరంజీవి మరియు
మోహన్ రాజా 'లూసిఫర్'
రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్'
సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి
మోహన్ రాజా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ
సినిమా గురించి
మోహన్ రాజా సత్యదేవ్,
నయనతార ,
సల్మాన్ ఖాన్ వంటి మంచి మంచి నటులను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాగే వీరితో పాటే మరొక ప్రముఖ ఒక వ్యక్తిని కూడా సినిమాలో భాగస్వామ్యం చేయడానికి
మోహన్ రాజా ప్రయత్నాలు చేస్తున్నాడట, ఆయన ఎవరో కాదు యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్. ఈయన ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు అని ఒక వార్త ఫిల్మి దునియా లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం గద్దర్ ను ఎంపిక చేశారు అని ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారని వచ్చే షెడ్యూల్ లో గద్దర్ కు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయనున్నారు అని
ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం
వైజాగ్ లో జరగవలసిన ఈ చిత్ర షూటింగ్ సినిమాటో గ్రాఫర్ నిరవ్ షా డేట్స్ కుదరకపోవడంతో కొద్దిరోజులు వాయిదా పడింది. శ్రీమతి
సురేఖ కొణిదెల సమర్పణలో
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.