వామ్మో.. జబర్దస్త్ వర్ష.. ఇలా చూస్తే భయపడిపోతారు?
అయితే కొన్ని కొన్ని సార్లు చిత్రవిచిత్రమైన గెటప్ లు వేస్తూ తన అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడూ జబర్దస్త్ స్టేజ్ పై అందంగా కనిపించే వర్ష మొన్నటికి మొన్న ఒక జబర్దస్త్ ఎపిసోడ్ లో ఏకంగా ఒక బెగ్గర్ పాత్ర వేసి మొత్తం చిరిగిపోయిన దుస్తులు కట్టుకొని మాసిన జుట్టు తో స్టేజి మీదకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక పిచ్చి పట్టిన అమ్మాయి పాత్ర చేసింది జబర్దస్త్ వర్ష. ఎంతో అందంగా ఉండే వర్ష ఇలా కనిపించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
వర్ష అంటే ఎంతో అందంగా ఊహించుకున్నాము అని ఇలాంటి గెటప్ ఏంటి అంటూ కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఇలా కామెంట్ పెట్టిన వారు ఇక ఇప్పుడు వర్ష కొత్త గెటప్ చూస్తే మాత్రం గుండె పగిలి పోతుంది. ఒకప్పుడు ఏకంగా దగ్గరగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని మాసిన జుట్టుతో జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించిన వర్ష.. ఇక ఇప్పుడు అంతకంటే దారుణమైన గెటప్ వేసుకుని ఏకంగా నడిరోడ్డు మీద రచ్చ చేసింది. ఇటీవలే విడుదలైన ఊర్లో వినాయకుడు కు సంబంధించిన ప్రోమోలో రోడ్డుమీద వెళ్ళే వారికి ప్రపోజ్ చేయాలి అంటూ ఒక టాస్క్ ఇస్తారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా ఏకంగా ఒక సంచీ చేతపట్టుకుని చినిగిపోయిన బట్టలు వేసుకొని తెల్లటి జుట్టుతో పూర్తిగా ముఖానికి నలుపు రంగు పూసుకుని అందరినీ విసిగిస్తూ నడిరోడ్డుమీద హంగామా చేసింది వర్ష. కాగా వర్ష ను అలా చూసిన వారు అందరూ ఒక్కసారిగా భయపడిపోతున్నారు.