సమంత దంపతుల కొత్త ప్లాన్... ఫ్యాన్స్ ఖుషీ ?
థర్టీ ప్లస్ వయసున్నా, అందులోనూ మ్యారేజ్ తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు సామ్. అందుకు ప్రధాన కారణాలు తనకు ప్యాషన్ పై ఉన్న అంకితభావం, మక్కువే. పేరుకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా రియల్ లైఫ్ లో ఒక సామాన్యమైన మహిళగా జీవించడానికే ఇష్టపడతారు సామ్. గొప్ప హీరోయిన్, స్టార్ హీరో నాగ చైతన్య సతీమణి, అక్కినేని ఇంటి కోడలు, డబ్బు, హోదా ఇలా జీవితంలో అన్నీ సుఖాలు, సౌకర్యాలు ఉన్నా అందరిలో ఒకరిగా ఉండటానికే ఇష్టపడతారు సమంత.
అంతేకాదు వీలైనంత వరకు తన పనులు తానే చేసుకుంటారట. అయితే ప్రస్తుతం సమంత తనం కెరీర్ కి సంబంధించి ఒక న్యూస్ వినబడుతోంది. ఈమె త్వరలోనే నాగ్ చైతన్యతో కలిసి బుల్లి తెరపై ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్యనే సామ్ జామ్ ప్రోగ్రాం కు హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి హాట్ బాధ్యతలు కాకుండా...వీరిద్దరూ నిర్మాణ బాధ్యతలను చూసుకోనున్నారని తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం కు సంబంధించిన కాన్సెప్ట్ ను సామ్ అందిస్తున్నారట. ఈ కాన్సెప్ట్ తన మామ మరియు భర్త ఇద్దరికీ నచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ లానే ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే తావరలోనే సామ్ దంపతుల నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.