''శ్రీదేవి సోడా సెంటర్'' సినిమా రివ్యూ ఇచ్చిన మహేష్ !
ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్టింగ్ చాలా బ్రహ్మాండంగా ఉందని... ఇప్పటి వరకు అతను చేసిన సినిమాల్లో ది బెస్ట్ యాక్టింగ్ ఇదేనని బావ మరిది సుధీర్ బాబు పై ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారని... ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉందని పేర్కొన్నారు. అటు హీరోయిన్ ఆనంది శ్రీదేవి రోల్ లో... చాలా బ్రహ్మాండంగా నటించిందని ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు. శ్రీదేవి పాత్రకు హీరోయిన్ ఆనంది సరిగ్గా సరిపోయిందని మహేష్ బాబు వివరించారు.
ఈ అటు ఈ సినిమా దర్శకుడు కరణ్ కుమార్ పై కూడా మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. పలాస 1978 సినిమా తర్వాత దర్శకుడు కరణ్ కుమార్... మంచి సినిమాలు తీసుకువచ్చారని మహేష్ బాబు తెలిపారు. ఈ సినిమా విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లెవెల్ లో ఉన్నాయని... కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడవచ్చును తెలిపారు. ఇంత మంచి సినిమా చేసిన చిత్ర బృందానికి మహేష్ బాబు కంగ్రాట్స్ చెప్పారు. కాగా... హీరో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లు గా కరుణ కుమార్ దర్శకత్వం లో శ్రీదేవి సోడా సెంటర్ తెరకెక్కించారు. అయితే... ఈ సినిమా నిన్న విడుదల అయింది. విడుదలైన రోజే మంచి టాక్ తెచ్చుకుంది. శ్రీదేవి సోడా సెంటర్ మూవీ.