నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ సినిమా 'కిరాక్ పార్టీ' తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'చలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు , నటనకు హావభావాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగానే గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, భీష్మ వంటి సినిమాల్లో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కార్తీ హీరోగా నటించిన 'సుల్తాన్' సినిమాతో రష్మిక మందన తమిళ ప్రేక్షకులను కూడా పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రష్మిక మందన తమిళంలోనూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా తో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో కూడా నటిస్తుంది. వీటితో పాటే 'మిషన్ మజ్ను' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ గా ఉంది. ఇలా చేతిలో ఫుల్ సినిమాలు ఉండడం వల్ల బిజీబిజీగా దేశం మొత్తం తిరుగుతున్న రష్మిక మందన ఈ క్రమంలో తాజాగా ఎయిర్ పోర్ట్ లో మతిపోగొట్టే లుక్ లో కనిపించింది. ఊహించని విధంగా క్లీవేజ్ సొగసులతో ఎయిర్ పోర్టులో ఒక్కసారి తళుక్కున మెరవడం తో వందల్లో కెమెరా క్లిక్స్ ఆమెపై పడ్డాయి. చేతిలో జాకెట్ పట్టుకొని అలా వయ్యారంగా నడుస్తున్న రష్మిక మందన ను డిఫరెంట్ యాంగిల్ లో కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.