అఖండ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా...?
అయితే తాజాగా వస్తున్న ప్రచారం ప్రకారం “అఖండ” సినిమా అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. “ఆర్ఆర్ఆర్” ఇప్పటికే ఈ తేదీను లాక్ చేసిపెట్టుకున్నప్పటికీ ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి బాలయ్య అదే రోజున రావడానికి సిద్ధమయ్యాడని టాక్ వినిపిస్తుంది. మరోవైపు మెగా స్టార్ చిరంజీవి “ఆచార్య”తో అక్టోబర్ 13న రాబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయని సమాచారం. కానీ చిరంజీవి, కొరటాల తమ సినిమా విడుదల కోసం మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు క్రిస్మస్‌ను మంచి సీజన్‌గా భావిస్తున్నారని సమాచారం. అందులో బాలయ్య మరియు బోయపాటి దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. నిజానికి విజయదశమి “అఖండ”కు కలిసొచ్చే అంశమే అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే “అఖండ” విడుదల విషయం మరో యంగ్ హీరోకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.అక్కినేని అఖిల్ సినిమాను “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”ను అంతకు ఒకరోజు ముందుగా అనగ అక్టోబర్ 12న విడుదల చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఒకరోజు గ్యాప్ లో అఖిల బాలయ్యతో పోటీ పడడం ఆలోచించాల్సిన విషయమని అందరు అంటున్నట్లు సమాచారం. అఖిల్ కు కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదని తెలుస్తుంది.దాని కోసమే అంత కష్టపడుతున్నాడని తెలుస్తుంది. అందుకే వరుస సినిమాలను లైన్లో పెట్టి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడని సమాచారం.. “అఖండ” టీజర్ సోషల్ మీడియాలో సునామి సృష్టించిందట. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”పై అంచనాలు బాగానే ఉన్నాయని తెలుస్తుంది మరి ఇలాంటి సమయంలో అఖిల్ సింహమంటి బాలయ్యను ఎలా ఎదురుకుంటాడో చూడాలి. అలాగే ఈ సినిమాతోనైనా మంచి విజయం అందుకుంటాడో లేదో చూడాలి మరి.