సమంతకు ఆ హీరోలంటే అంత ఇష్టమా..?
ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ విడుదల నాటి నుండి సమంత పాత్ర తమిళుల మనోభావలను కించపరిచేదిగా ఉందని తీవ్ర నిరసన వ్యక్తం విషయం అందరికి తెలిసిందే. ఇక కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఆమె. వెంటనే కథను వినే మూడ్ తనకు ఇప్పుడు అస్సలు లేదని కొంచెం గ్యాప్ ఇచ్చిన తరువాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి అప్పుడు ఆలోచిస్తానని అన్నారని సమాచారం. అదే సమయంలో ఓ ఆసక్తికర ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారట.
హీరోయిన్ కాక ముందు మీరు కలిసి నటించాలనుకున్న హీరోలు ఎవరని యాంకర్ ఓ ప్రశ్నను అడుగగా సమంత ఏ మాత్రం తడుముకోకుండా మహేష్ బాబు, సూర్య మరియు షారుక్ ఖాన్ అని ఆ బిగ్ స్టార్స్ పేర్లు చెప్పేసిందట. ఈ ముగ్గురు హీరోల సరసన నటించాలని నాకు ఎంతో ఆసక్తి ఉండేదని సమంత తన ఒకప్పటి కోరిక బయటపెట్టారని తెలుస్తుంది. అయితే మహేష్ తో సమంత రెండు చిత్రాలు చేశారట. దూకుడు, బ్రహ్మోత్సవం చిత్రాలలో సమంత, మహేష్ కలిసి నటించడం జరిగిందని అందరికి తెలిసిన విషయమే. ఇక సూర్యతో సైతం రెండు చిత్రాలు చేశారట సమంత. అంజాన్ మరియు 24 చిత్రాలలో వీరు కలిసి నటించారట. అయితే షారుక్ ఖాన్ తో నటించాలన్న ఆమె కోరిక అలాగే మిగిలి ఉండి పోయిందని తన మనసులో మాట బయటపెట్టారట సమంత. సమంతకు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి మరి.