మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ మలయాళ సినిమాలతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ , తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 'రన్' అనే తెలుగు డబ్బింగ్ మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మీరాజాస్మిన్. ఆ తరువాత నేరుగా తెలుగులో శివాజీ హీరోగా 'అమ్మాయి బాగుంది' సినిమా తో మెప్పించింది . ఈ సినిమాలో మీరాజాస్మిన్ అందచందాలకు నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది.


అందులో భాగంగానే రవితేజ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన 'భద్ర సినిమాతో మంచి హిట్ ను అందుకున్న ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో 'గుడుంబా శంకర్' , రాజశేఖర్ కు చెల్లెలుగా 'గోరింటాకు' సినిమాతో తెలుగు ప్రజలను మరోసారి మెప్పించింది. అయితే ఇలా కెరియర్ మంచి జోష్ లో నడుపుతున్న సమయంలోనే 2014లో దుబాయి లో ఇంజనీరింగ్ పని చేస్తున్న అనిల్ జాన్ టైటాన్ నీ పెళ్లి చేసుకున్న మీరాజాస్మిన్ సినిమాలకు  దూరమైంది. అయితే పెళ్లి తర్వాత విభేదాల కారణంగా భర్తతో మీరాజాస్మిన్ విడిపోయింది. అయితే భర్త తో విడిపోయిన వెంటనే ఆమె సినిమాల్లోకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ మీరాజాస్మిన్ ఇప్పుడు మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం ఓ మలయాళ సినిమాలో మీరాజాస్మిన్ గెస్ట్ రోల్ లో కనిపించింది. అయితే ప్రస్తుతం మీరా జాస్మిన్ పూర్తిగా సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాల్లో అందంగా కనిపించడం కోసం ఈ ముద్దుగుమ్మ జిమ్ కు వెళ్ళి వెయిట్ లాస్ అవుతుందట. ప్రజెంట్ మీరాజాస్మిన్ కు సంబందించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి. మీరా జాస్మిన్ రీ ఎంట్రీ లో మంచి విజయాలను సాధించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: