" data-original-embed="
">
ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న "ఎవరు మీలో కోటీశ్వరులు" షో నేడు రాఖీ
పూర్ణిమ సందర్భంగా ఎంతో ఘనంగా ప్రారంభం అయింది. అంతే కాదు ప్రేక్షకుల్ని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ముంచెత్తిన
జూనియర్ ఎన్టీఆర్ మరియు
రామ్ చరణ్ కాంబో ఈ షో మొదటి
ఎపిసోడ్ లో కనిపించి అభిమానులను అలరించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ స్టార్ డం ఉన్న
బన్నీ మరియు
తారక్ లు ఒకే తెరపై కనిపించబోతుండడంతో అభిమానుల్లో సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ నేడు బుల్లి తెరపై కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అంతేకాదు
రామ్ చరణ్ ను బుల్లితెరపై చూసిన తమ అభిమానులు ఆనందంతో చిందులు వేశారు.
కొందరు రంగు కాగితాలు విసురుతూ విజిల్స్ వేశారు. ఇంకొందరు షోలో కనిపించిన చెర్రీ మరియు
ఎన్టీఆర్ లకు దిష్టి తీశారు. ఒక అభిమాని అయితే
రామ్ చరణ్ ను షోలో చూసి తాను షో చూస్తున్న టీవి ముందు నిలబడి చెర్రీకి హారతి ఇచ్చాడు.
రామ్ చరణ్ పై తన అభిమానాన్ని ఈ విధంగా చూపించాడు ఆ అభిమాని. దీనిని బట్టి చూస్తే
రామ్ చరణ్ ను అభిమానులు దేవుడిలాగా చూస్తున్నారు. మొదట ఆ పిక్
ట్విట్టర్ లో పోస్ట్ కాగా... ప్రస్తుతం ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన
రామ్ చరణ్,
జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు
రాజమౌళి డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ
సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు పెంచుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలోని హీరోలు బుల్లితెరపై కనిపించడంతో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు.
జెమిని టీవి లో నేడు మొదలైన "ఎవరు మీలో కోటీశ్వరులు" మొదటి
ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఒకే స్క్రీన్ పై ఈ స్టార్ హీరోలను చూసిన జనం సంతోషంతో ఉరకలు వేశారు. రేపు రెండో
ఎపిసోడ్ ప్రసారం కానుంది. రేపు కూడా ఇంతే సరదాగా కొనసాగనుంది.