పవన్ తో తనకు ఉన్న రిలేషన్ కు దిష్టి తగులుతుంది అంటున్న చెర్రీ ..?
ఇక ఎప్పటి నుంచో ఎదురు చూసిన బుల్లితెర ప్రేక్షకులకు ఆరోజు రానే వచ్చేసింది. ఇక ఆగస్టు 23వ తేదీ నుంచి సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8:30 గంటలకు ప్రసారమయ్యే, ఈ షో ..ఈ రోజు కర్టెన్ రైజర్ మొదలైంది. ఇక ఈ షో కి రామ్ చరణ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. ఈ షో లో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ తనదైన శైలిలో సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇక మొదటి నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. కాబట్టి ఎన్టీఆర్ దగ్గర ఏ విషయాన్ని దాచుకోకుండా రామ్ చరణ్ చెప్పేయడం ప్రస్తుతం అందరికీ ఆనందాన్ని కలిగించడంతో పాటు, రామ్ చరణ్ గురించి తెలియని మరికొన్ని విషయాలు కూడా వింటుంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
అందులో భాగంగానే ఎన్టీఆర్ , రామ్ చరణ్ ను ఇలా అడిగారు.. పవన్ కళ్యాణ్ తో మీకున్న అనుబంధం ఎలాంటిది..? అని రామ్ చరణ్ ను అడగగా అప్పుడు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో ఉన్న తన అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.." పవన్ ని బాబాయ్ అనాలో తెలియదు..అన్నా అనాలో తెలియదు..ఇక తండ్రి లాంటివాడు అనాలో తెలియదు. మొత్తానికి ఏమనాలో కూడా నాకు అర్థం కాదు.. మా రిలేషన్ బయట పెడితే ఆ బంధానికి దిష్టి తగులుతుందేమో ..అని అనిపిస్తూ ఉంటుంది" అని చరణ్ చెప్పారు. "అంతేకాదు పవన్ రిలేషన్ గురించి ఎవరు అడిగినా నేను సైలెంట్ గా ఉండి పోతానే, కానీ ఎవరికీ ఎలాంటి సమాధానం ఇవ్వను. అడిగింది నువ్వు కాబట్టి చెబుతున్నాను " అని ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.