బండ్ల గణేష్ పారితోషకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..!
మొదట్లో ఒక నటుడిగా ,కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా సొంతం చేసుకున్న తమిళ్ రీమేక్ సినిమాలో హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే ఈ సినిమాలో బండ్ల గణేష్ నటిస్తున్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఆ విషయానికే వస్తే , బండ్ల గణేష్ ఈ సినిమా కోసం 25 లక్షల రూపాయలను తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక నిర్మాతగా.. నిర్మాతలకు ఎటువంటి బాధలు ఉంటాయో తెలుసు కాబట్టే , ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను అని చెప్పాడు బండ్ల గణేష్. అంతేకాదు ఈ సినిమా గనుక మంచి విజయాన్ని తెలుగులో అందుకున్నట్లయితే తప్పకుండా మరి కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తాను అని కూడా తెలిపినట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
కమెడియన్ గా మొదలు పెట్టి ,నటుడిగా గుర్తింపు తెచ్చుకొని నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న బండ్ల గణేష్ , హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.