నేచురల్ స్టార్
నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫిల్మ్‌తో
టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ
మెహ్రీన్ పిర్జాదా కౌర్. అందం ప్లస్ అభినయం ఉన్న ఈ
భామ అనతి కాలంలోనే హీరోయిన్గా రాణించింది. తెలుగు, హిందీ,
తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ నటి.. సోషల్
మీడియా లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
సోషల్
మీడియా వేదికగా ఆమె పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలు పంచుకుంటు ఉంటుంది. ఇటీవల మెహ్రీన్‌కు
హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు
భవ్య బిష్ణోయ్‌తో
పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన
పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్న సమయంలో మెహరీన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. మ్యారేజ్ క్యాన్సిల్ అయినట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజెంట్ ఈ
బ్యూటిఫుల్ హీరోయిన్ తన కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు పది కేజీల వెయిట్ లాస్ అయిందట.
తాజాగా
మెహ్రీన్ స్కిన్ టోన్ అండ్ మల్టీ కలర్ డ్రెస్‌తో ఉన్న పలు ఫొటోస్ను ‘ఇన్
లవ్ విత్ దిస్ లుక్’ అనే క్యాప్షన్‌తో సోషల్
మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసి నెటిజన్లు వెరీ హాట్ హీరోయిన్, లుకింగ్ గార్జియస్ అని కామెంట్స్ చేస్తున్నారు. మేము కూడా ఈ లుక్ చూసి లవ్‌లో పడిపోయామంటూ కొందరు ఫొటోను లైక్ చేస్తున్నారు.
అయితే, ఈ ఫొటోలన్నీ కూడా
కన్నడ ఫిల్మ్ ‘నీసిగూవరెగు’ ఓపెనింగ్ సందర్భంగా తీసినవని పేర్కొంది మెహ్రీన్. ఈ నేపథ్యంలో
కన్నడ ఫ్యాన్స్ ఆమెకు శాండల్‌వుడ్ తరఫున వెల్ కమ్ చెప్తున్నారు.
నాగశౌర్య ‘అశ్వత్థామ’ చిత్రంలో చివరగా తెలుగు ప్రేక్షకులకు కనిపించిన
భామ త్వరలో
అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఫన్నీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 3’లో కనిపించనుంది. ఈ ఫిల్మ్ ‘ఎఫ్ 2’కు సీక్వెల్ కాగా ఇందులో ‘హనీ’గా అలరించింది క్యూట్ మెహ్రీన్. ఈ చిత్రంతో పాటు
మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలోనూ హీరోయిన్గా నటించింది.