జాన్వి అడుగులు ఎటు వైపు..?
సూపర్ స్టార్ మహేశ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫైనల్ అయినట్లు మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీ సరసన జాన్వి నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే ‘ఐకాన్’ ఫిల్మ్‌లో బన్నీ సరసన జాన్వికపూర్ ఎంపికయినట్లు వార్తలొస్తున్నాయి.
అయితే, చాలా రోజుల నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు జాన్వి కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి టాలీవుడ్లో సత్తా చాటిన తర్వాతనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వగా, జాన్వి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రజెంట్ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ‘రూహి’ సినిమాలో జాన్వి నటకుగాను విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ను హిందీలో రీమేక్ చేయాలని మేకర్స్ భావిస్తుండగా, ఇందులో లీడ్ రోల్‌ను జాన్వికపూర్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కరణ్ జోహార్ డైరెక్షన్లో వస్తున్న ‘దోస్తానా 2’లోనూ జాన్వి నటిస్తున్నది. టాలీవుడ్లో ఏ హీరో ద్వారా ఎంట్రీ ఇస్తుందో ఈ భామ మరి చూడాలి. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, మహేశ్ బాబు సినిమాల్లో చాన్స్ రాకపోగా, అల్లు అర్జున్ సినిమాతోనైనా జాన్వి ఎంట్రీ ఇచ్చేనా? చూడాలి..