మంచు విష్ణు- మనోజ్ మధ్య గొడవలు.. నిజమేనా?

frame మంచు విష్ణు- మనోజ్ మధ్య గొడవలు.. నిజమేనా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు గా కొనసాగుతున్న మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక మొదట్లో ఈ ఇద్దరు హీరోల దూకుడు చూస్తే స్టార్ హీరోలుగా ఎదుగుతారు అని అందరూ అనుకున్నారు. కానీ  ఇప్పటికీ స్టార్ హీరోలుగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నో ప్రయత్నాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వీరి సినిమాలు మాత్రం అటు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి అని చెప్పాలి. అయితే ఓ వైపు మంచు విష్ణు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ మంచు మనోజ్ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు.



 ఇక ఇద్దరు అన్నదమ్ములు సినిమాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ.. నిజజీవితంలో  మాత్రం ఒకరితో ఒకరు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడైనా స్టేజి మీద కనిపించిన కూడా ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకోడం చూస్తూ ఉంటాం. ఇక తండ్రి మోహన్ బాబు దగ్గర మంచు విష్ణు  కాస్త అణుకువగా ఉంటే.. అటు మంచు మనోజ్ మాత్రం అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా  కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.



 ఈ మంచు బ్రదర్స్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదని కనీసం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం కూడా లేదు అన్నది గతకొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవలే ఆలీతో సరదాగా ఈ కార్యక్రమానికి మంచు విష్ణు గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఒక ప్రశ్న అడుగుతాను.. దానికి ఎంతో సీరియస్గా సమాధానం చెప్పాలి అంటూ అలీ చెబుతాడు.  నీకు మీ తమ్ముడికి మధ్య గొడవలు జరుగుతున్నాయట కదా.. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని ముఖ్యంగా మీ తమ్ముడు పై నువ్వు చాలా కోపంగా ఉన్నావు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి అందులో ఎంత నిజం ఉంది అంటూ అడిగాడు.



అయితే ఇక ఈ ప్రశ్నకు ఎంతో సీరియస్గా స్పందించాడు మంచు విష్ణు. ఆ విషయం గురించి వాళ్లకు ఎందుకు చెప్పాలి.. అవసరం ఏముంది అంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా ఏకంగా కోట్ విప్పి షో నుంచి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమయ్యాడు మంచు విష్ణు.  ఇదంతా చూస్తుంటే నిన్న మొన్నటి  వరకు ఇద్దరు మంచు బ్రదర్స్ మధ్య గొడవలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే కాదు నిజమే అన్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంట్లో అసలు నిజమెంతో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంత  వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: